PM Modi: సొంత ఇల్లు, కారు లేదు.. ప్రధాని మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

|

May 15, 2024 | 6:58 AM

PM Modi election affidavit: వారణాసి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు ప్రధాని మోదీ. గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో తన అఫిడవిట్‌ పత్రాలను సమర్పించారు. సొంతిల్లు.. కారు లేదని ఆఫిడవిట్ లో పేర్కొన్నారు మోదీ.

PM Modi: సొంత ఇల్లు, కారు లేదు.. ప్రధాని మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
PM Modi
Follow us on

PM Modi election affidavit: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ. నామినేషన్‌ సందర్భంగా తన ఆస్తుల వివరాలకు సంబంధించిన ఆఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు మోదీ. ప్రధాని ఆఫిడవిట్ ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుజరాత్‌కి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత భారతదేశానికి పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ఆఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు వరల్డ్ వైడ్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. సొంత ఇల్లు, కారు లేదని భారత ప్రధాని మోదీ తన అఫిడవిట్‌ లో పేర్కొనడం షాక్‌కు గురిచేసింది. కేవలం 3.02 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే తన దగ్గర ఉన్నట్లు ఆఫిడవిట్‌లో ప్రకటించారు మోదీ. తన ఆస్తిలో 2.86 కోట్లు ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. గాంధీనగర్‌, వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాల్లో 80వేల 304 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన దగ్గర 52 వేల 920 రూపాయల నగదు, 2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు మోదీ.

2014లో మోదీ ఎంపీగా పోటీ చేసినప్పుడు.. ప్రజెంట్ మోదీ డిక్లేర్ చేసిన ఆస్తులతో పోల్చుకుంటే 2019లో ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2018-19లో 11.14 లక్షల రూపాయలు ఉన్న తన ఆదాయం.. 2022-23లో 23.56 లక్షలకు పెరిగినట్లు తెలిపారు మోదీ. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌లలో 9.12 లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే, ప్రధాని మోదీకి ఎలాంటి భూములు కానీ, ఇల్లు, కారు, షేర్లు, మ్యూచుఫల్ పండ్స్‌లో పెట్టుబడులు కానీ లేవని ఆఫిడవిట్‌లో తెలిపారు. ప్రభుత్వ జీతం, బ్యాంకుల నుంచి వడ్డీలను తన ఆదాయ మార్గాలుగా మోదీ ప్రకటించారు.

1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌.. 1983లో గుజరాత్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు మోదీ. ఇప్పటివరకు తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని.. ప్రభుత్వ బకాయిల కేసులు కూడా లేవని తెలిపారు ప్రధాని మోదీ. ఇక తన భార్య ఆదాయమార్గాలు తనకు తెలియవని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు మోదీ. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఏడో దశలో భాగంగా జూన్‌ 1న వారణాసిలో పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4 తేదీన దేశ వ్యాప్తంగా ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..