G-20 Summit – PM Modi: జీ-20 సదస్సుపై ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. సీఎం జగన్‌, చంద్రబాబు హాజరు

జీ-20 సదస్సు సన్నాహాక ఏర్పాట్లపై రాష్ట్రపతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

G-20 Summit - PM Modi: జీ-20 సదస్సుపై ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. సీఎం జగన్‌, చంద్రబాబు హాజరు
Pm Modi
Follow us

|

Updated on: Dec 05, 2022 | 8:06 PM

జీ-20 సదస్సు సన్నాహాక ఏర్పాట్లపై రాష్ట్రపతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సలహాలు, సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన.. రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సిక్కిం నుంచి ప్రేమ్ సింగ్ తమాంగ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ జి 20 సన్నాహాల గురించి ప్రభుత్వం ప్లాన్ చేసిన కార్యక్రమాల గురించి ప్రజెంటేషన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 1న జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా 200కి పైగా సన్నాహక సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జి20 సమ్మిట్ జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!