PM Modi Birthday: నేడు ప్రధాని పుట్టిన రోజు.. ప్రారంభంకానున్న ‘పక్షం రోజులు సేవ’.. నేరుగా శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..

|

Sep 17, 2023 | 8:29 AM

కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోడీకి ఇప్పటికే జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం, NaMo యాప్‌ని ఉపయోగించి.. ప్రజలు వీడియో సందేశం ద్వారా కూడా PM మోడీకి తమ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. నమో యాప్‌లో తమ వీడియోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. శుభాకాంక్షల అన్ని వీడియో శుభాకాంక్షలు కూడా వీడియో పేజీలో కనిపిస్తాయి. న

PM Modi Birthday: నేడు ప్రధాని పుట్టిన రోజు.. ప్రారంభంకానున్న పక్షం రోజులు సేవ.. నేరుగా శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..
PM Modi MP Visit
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ పుట్టినరోజు వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు.  గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న మోడీ జన్మించారు.అయితే ప్రధాని మోడీ  జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా భిన్నంగా జరపడడానికి బీజేపీ రెడీ అయింది. నేడు ‘సేవా పఖ్వాడా’ అంటే పక్షం రోజులు సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమై మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది.అంతేకాదు బీజేపీ నేతలు తమ ప్రియతమ ప్రధానమంత్రి పుట్టిన రోజున NaMo యాప్ ద్వారా ‘ఎక్స్‌ప్రెస్ యువర్ సేవా భావ్’ ప్రచారాన్ని ప్రారంభించనుంది. దేశానికి సేవ చేసేలా పౌరులను ప్రేరేపించడమే ఈ ప్రచారం ఉద్దేశమని బీజేపీ చెబుతోంది.

కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోడీకి ఇప్పటికే జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం, NaMo యాప్‌ని ఉపయోగించి.. ప్రజలు వీడియో సందేశం ద్వారా కూడా PM మోడీకి తమ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. నమో యాప్‌లో తమ వీడియోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. శుభాకాంక్షల అన్ని వీడియో శుభాకాంక్షలు కూడా వీడియో పేజీలో కనిపిస్తాయి. నమో యాప్‌ను వినియోగించే వారు కార్మికులు లేదా మరెవరైనా సరే, ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా తాము సేవ చేస్తూ అదే గిఫ్ట్ గా ఇవ్వొచ్చు అని .. మోడీ బర్త్ డే కానుకగా తాము సేవ చేస్తూ తెలియజేయవచ్చునని పేర్కొంది.

 ఈ ‘సేవ’లలో దేనినైనా ఎంచుకోవచ్చని బీజేపీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

స్వావలంబన: భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టి.. ఆ ఫోటోను వినియోగదారులు షేర్ చేయవచ్చు.

రక్తదానం: రక్తదానం చేస్తూ ఆ వీడియోను షేర్ చేయండి. రక్త దానం మరొకరి ప్రాణాలను కాపాడే  గొప్ప కార్యక్రమం. ప్రాణాపాయంలో ఉన్న అనేకమందికి అమూల్యమైన జీవితాన్ని ఇస్తారు. రక్తదానం చేసే వ్యక్తులు తమ సహోద్యోగులను కూడా ప్రోత్సహించాలి.

నీటి సంరక్షణ: నమో యాప్ వినియోగదారులు వర్షపు నీరు వృధా అవ్వకుండా నీటిని సంరక్షణ కోసం చర్యలు చేపట్టి.. అందుకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఈ వీడియోలు ‘క్యాచ్ ద రెయిన్’ ప్రచారం గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో సహాయపడుతుంది.

 డిజిటల్ ఇండియా: వినియోగదారులు తమ దైనందిన జీవితంలో డిజిటల్/టెక్ ఇన్నోవేషన్‌ని అవలంబిస్తున్నట్లు లేదా మరొకరు దానిని స్వీకరించడంలో సహాయపడే వీడియోను పోస్ట్ చేయవచ్చు.

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గురించి తెలియజేస్తూ.. వైవిధ్యం,  అందమైన సంస్కృతిని ప్రదర్శించే ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి.. అందుకు సంబంధించిన వీడియోలను వినియోగదారులు అప్‌లోడ్ చేయవచ్చు.

పర్యావరణం కోసం జీవనశైలి: పీఎం మోడీ ‘లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్’  అంటే పర్యావరణం కోసం జీవనశైలి అనే విషయాన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదింపజేశారు. ఏకకంఠంతో వివిధ దేశాధినేతలు చెప్పారు. దీనిని ఆచరిస్తూ ప్రజలు తమ వీడియోలను లేదా ఫోటోలను పంచుకోవచ్చు.

స్వచ్ఛ భారత్: యాప్ వినియోగదారులు తమ పరిసరాలను శుభ్రం చేయడానికి చొరవ తీసుకున్న వీడియోలను పంచుకోవచ్చు.

TB ఫ్రీ భారత్: క్షయ రహిత భారత్ కోసం.. TB రోగిని దత్తత తీసుకోవచ్చు. అందుకోసం పౌష్టికాహారం, వైద్యం, అవగాహన తదితర నిత్యావసర సేవలు అందజేస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది.

మేక్ ఇన్ ఇండియా : ప్రజలు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి అందుకు సంబంధించిన  చిత్రాన్నిషేర్ చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..