Modi Birthday: ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా వివిధ బహుమతులు వేలం.. వచ్చిన డబ్బుని ఏమి చేస్తారంటే..

|

Sep 17, 2024 | 9:50 AM

గత ఏడాది కాలంలో ప్రధాని మోడీకి బహుమతులుగా వచ్చిన 600 వస్తువులను వేలం వేయనున్నారు. అత్యధిక బేస్ ధర ఉన్న బహుమతులలో పారాలింపిక్ కాంస్య పతక విజేత నిత్యా శ్రీశివన్, సుకాంత్ కదమ్‌ల బ్యాడ్మింటన్ రాకెట్లు .. రజత పతక విజేత యోగేష్ ఖతునియా డిస్కస్ ఉన్నాయి. వీటి బేస్ ధర దాదాపు 5.50 లక్షలు. ధరలు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉన్నాయి.

Modi Birthday: ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా వివిధ బహుమతులు వేలం.. వచ్చిన డబ్బుని ఏమి చేస్తారంటే..
Pm Modi's Birthday
Follow us on

నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు. 74 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన 600కు పైగా బహుమతులు వేలం వేయనున్నారు. వేలానికి ఉంచే ఈ బహుమతుల బేస్ ధర దాదాపు రూ.1.5 కోట్లు. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. పారాలింపిక్ పతక విజేతల బూట్లు, ఇతర వస్తువుల నుంచి రామమందిరం ప్రతిరూపం వరకు వేలం వేసే వస్తువుల్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.

సోమవారం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ప్రధాని మోడీ అందుకున్న బహుమతుల ప్రదర్శనను గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించారు. ఈ కానుకలను వేలం వేయడానికి మూల ధరను ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ధరలు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉన్నాయి.

వేలంలో వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తారంటే

తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేసే కొత్త సంస్కృతికి ప్రధాని శ్రీకారం చుట్టారని చెప్పారు గజేంద్ర సింగ్ షెకావత్. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవారు. తనకు అందిన కానుకలను వేలం ద్వారా ప్రజలకు అందజేసేవారు. దీని ద్వారా వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు వినియోగించే వారు. ఈ తరహా వేలం ఈ ఏడాది ఆరవది. ఈసారి కూడా వచ్చిన సొమ్మును జాతీయ గంగానది నిధికి విరాళంగా అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది కాలంలో ప్రధాని మోడీకి బహుమతులుగా వచ్చిన 600 వస్తువులను వేలం వేయనున్నారు. అత్యధిక బేస్ ధర ఉన్న బహుమతులలో పారాలింపిక్ కాంస్య పతక విజేత నిత్యా శ్రీశివన్, సుకాంత్ కదమ్‌ల బ్యాడ్మింటన్ రాకెట్లు .. రజత పతక విజేత యోగేష్ ఖతునియా డిస్కస్ ఉన్నాయి. వీటి బేస్ ధర దాదాపు 5.50 లక్షలు.

క్యాప్ బేస్ ధర రూ. 2.86 లక్షలు

పారాలింపిక్‌లో కాంస్య పతక విజేత అజిత్ సింగ్, సిమ్రాన్ శర్మ, రజత పతక విజేత నిషాద్ కుమార్ బహుమతిగా ఇచ్చిన షూస్‌తో పాటు రజత పతక విజేత శరద్ కుమార్ సంతకం చేసిన క్యాప్ బేస్ ధర రూ.2.86 లక్షలుగా ఉంది. అంతేకాదు రామ మందిరం ప్రతిరూపం కూడా వేలం వేసే వస్తువుల్లో ఉంది. దీని బేస్ ధర రూ.5.50 లక్షలు. నెమలి విగ్రహం కూడా ఉంది. దీని బేస్ ధర రూ.3.30 లక్షలు.

రామ్ దర్బార్ విగ్రహం ధర రూ.2.76 లక్షలు. వెండి వీణ ధర రూ.1.65 లక్షలు. మరికొన్ని వస్తువులు కూడా ఉన్నాయి, వీటిని వేలం వేయనున్నారు. కాటన్ అంగవస్త్రాలు, క్యాప్‌లు, శాలువాలు అతి తక్కువ బేస్ ధర కలిగిన బహుమతులలో ఉన్నాయి. వీటి ధర రూ.600. ప్రధాని మోడీ జన్మదినమైన నేడు ( సెప్టెంబర్ 17న ) వేలం ప్రారంభం కానుంది. అక్టోబర్ 2న ముగుస్తుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..