AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదురులేని మోదీ… పెరుగుతున్న పాపులారిటీ

ప్రధాని మోదీ పాపులారిటీ పెరిగిపోతోంది. ఆయన నాయకత్వ అప్రూవల్ రేటింగ్ జనవరి 7 నాటికి 76 శాతం ఉండగా.. ఏప్రిల్ 21 నాటికి అది 83 శాతానికి పెరిగిందని అమెరికాలోని మార్నింగ్ కన్సల్ట్ అనే రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న కరోనా బీభత్సం ఆయనకు పరోక్షంగా ‘సాయపడిందన్న’ అభిప్రాయాలు వినవస్తున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు కూడా దేశ రాజకీయ, ఆర్ధిక సమస్యలతో మోదీ ప్రభుత్వం కొట్టుమిట్టాడింది. ముఖ్యంగా ఎకానమీని ఎలా పునరుధ్దరించాలన్న దానిపై మోదీ […]

ఎదురులేని మోదీ... పెరుగుతున్న పాపులారిటీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 30, 2020 | 4:36 PM

Share

ప్రధాని మోదీ పాపులారిటీ పెరిగిపోతోంది. ఆయన నాయకత్వ అప్రూవల్ రేటింగ్ జనవరి 7 నాటికి 76 శాతం ఉండగా.. ఏప్రిల్ 21 నాటికి అది 83 శాతానికి పెరిగిందని అమెరికాలోని మార్నింగ్ కన్సల్ట్ అనే రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న కరోనా బీభత్సం ఆయనకు పరోక్షంగా ‘సాయపడిందన్న’ అభిప్రాయాలు వినవస్తున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు కూడా దేశ రాజకీయ, ఆర్ధిక సమస్యలతో మోదీ ప్రభుత్వం కొట్టుమిట్టాడింది. ముఖ్యంగా ఎకానమీని ఎలా పునరుధ్దరించాలన్న దానిపై మోదీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుండగా,, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రేగిన  అల్లర్లు, ఘర్షణలతో ఆయన ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పలు ప్రపంచ దేశాలు తప్పు పట్టాయి. అమెరికాలో అయితే అదే పనిగా సెనేట్ లోను, ప్రతినిధుల సభలోను చాలామంది ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూ కాశ్మీర్ లో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ  ఇందుకు ‘అవసరమైన ‘ప్రత్యేక కమిటీ’ లు కూడా ఏర్పాటయ్యాయి. అయితే మార్చి మొదటివారంలో దేశంలో ‘ప్రవేశించిన కరోనాను మోదీ సవాలుగా తీసుకుని.. దీని అదుపునకు అనేక చర్యలు చేపట్టి సఫలీకృతులు కావడంతో.. అవన్నీ గత స్మృతులుగానే మిగిలిపోయాయి.

ఐఏఎన్ఎస్-సీ ఓటర్..కోవిడ్-19 ట్రాకర్ కూడా మోదీ నాయకత్వం పట్ల విశ్వసనీయత రేటింగ్ మార్చి 25 నాటికి 76.8 శాతం ఉండగా.. ఏప్రిల్ నాటికి అది 93.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా వైరస్ పై పోరులో ఫ్రంట్ రన్నర్ గా నిలిచిన మోదీ.. కరోనాను ఎదుర్కోవడంలో పలు ఇతర దేశాలకు ‘ఆపద్బాంధవుడే’ అయ్యారు. అమెరికా వంటి అగ్ర రాజ్యం కూడా తమ దేశంలో కరోనా చికిత్స కోసం భారత్ ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం ‘దేహీ’ అని చేతులు చాచక తప్పలేదు. బ్రెజిల్, శ్రీలంక వంటి దేశాలు సైతం మన శరణు జొచ్చాయి.