కోవిడ్ కారణంగా బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ , బోరిస్ జాన్సన్ ఆహ్వానానికి సున్నితంగా తిరస్కరణ

| Edited By: Phani CH

May 11, 2021 | 10:04 PM

దేశంలో కోవిద్ మహమ్మారి బీభత్సంగా ఉన్న కారణంగా ప్రధాని మోదీ తన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో జూన్ లో జరగనున్న జీ-7 సమ్మిట్ కి ఆయన హాజరు కావలసి ఉంది.

కోవిడ్ కారణంగా  బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ , బోరిస్ జాన్సన్ ఆహ్వానానికి సున్నితంగా తిరస్కరణ
PM Modi
Follow us on

దేశంలో కోవిద్ మహమ్మారి బీభత్సంగా ఉన్న కారణంగా ప్రధాని మోదీ తన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో జూన్ లో జరగనున్న జీ-7 సమ్మిట్ కి ఆయన హాజరు కావలసి ఉంది. జూన్ 11-13 తేదీల్లో అగ్రరాజ్యాధినేత తో బాటు పలువురు దేశాధినేతలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి మోదీని ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే యూకే ప్రధాని బోరిస్ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు ఆ ప్రతినిధి చెప్పారు.. దేశంలో కోవిద్ పరిస్థితి గురించి జాన్సన్ కు మోదీ తెలియజేశారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో బాటు కెనడా,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాధినేతలు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రపంచ దేశాల్లో కోవిద్ పరిస్థితి,, గ్లోబల్ ఎకానమీలపై ఈ సమ్మిట్ లో చర్చిస్తారని తెలిసింది.

2019 లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో జరిగిన జీ-7 సమ్మిట్ కు హాజరయ్యారు. ఈ బృందంలోని సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నాటి సమ్మిట్ లో నిర్ణయించారు. రక్షణ, ఆర్ధిక తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతో బాటు టెర్రరిజం నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై కూడా నాడు దేశాధినేతలు చర్చించారు. ఇప్పుడు ఇండియాలో కోవిద్ పరిస్థితి తీవ్రంగా ఉన్న కారణంగా తాను ఈ సదస్సుకు హాజరు కాలేనని మోదీ తన అశక్తతను వ్యక్తం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bill Gates and Melinda Divorce: 2019లోనే తెగిన గేట్స్​ దంపతుల బంధం..?? ఆసక్తికర విషయాలు వెల్లడి.. ( వీడియో )

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. కరోనా బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక మెడికల్ కిట్లు