PM Modi: క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో భారత్‎కు అరుదైన గౌరవం.. స్పందించిన ప్రధాని మోదీ..

| Edited By: Ram Naramaneni

Jun 07, 2024 | 9:04 AM

క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో భారత విశ్వవిద్యాలయాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. విద్యా రంగాన్ని, విద్యార్థులను ప్రశంసిస్తూ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. QS Quacquarelli Symonds Ltd, Nunzio Quacquarelli సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్‌ను రీ ట్వీట్ చేశారు మోడీ. ఆ ట్వీట్ లో ఇలా ఒక సందేశాన్ని జోడించారు. “గత దశాబ్దకాలంలో, తాము విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి గుణాత్మక మార్పులను తీసుకొచ్చినట్లు తెలిపారు.

PM Modi: క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో భారత్‎కు అరుదైన గౌరవం.. స్పందించిన ప్రధాని మోదీ..
PM Modi
Follow us on

క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో భారత విశ్వవిద్యాలయాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. విద్యా రంగాన్ని, విద్యార్థులను ప్రశంసిస్తూ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. QS Quacquarelli Symonds Ltd, Nunzio Quacquarelli సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్‌ను రీ ట్వీట్ చేశారు మోడీ. ఆ ట్వీట్ లో ఇలా ఒక సందేశాన్ని జోడించారు. “గత దశాబ్దకాలంలో, తాము విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి గుణాత్మక మార్పులను తీసుకొచ్చినట్లు తెలిపారు. వాటి ఫలితమే నేడు ఈ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి లభించిన కితాబు అని తెలిపారు. తమ విలువ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఇలాంటి అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. అలాగే వారిని ప్రోత్సహించిన సంస్థల కృషి, అంకితభావానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మరిన్ని పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను పెంచడానికి తాము ఇంకా ఎక్కువ పనిచేసేందకు సిద్దంగా ఉన్నామంటూ సందేశాన్ని ఇచ్చారు. “2015లో 11 సంస్థలతో పోలిస్తే, ఈ 10 సంవత్సరాలలో 46 సంస్థలు వచ్చాయని పేర్కొన్నారు. తద్వారా 318% పెరుగుదల సాధ్యమైందన్నారు. G20లో ఇది అత్యుత్తమమైన ప్రతిభను కనబర్చడానికి దోహదపడినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..