PM Modi: కేంద్ర మంత్రి నివాసంలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న ప్రధాని మోదీ..

దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ అనే నినాదాన్ని విలపించారు. సంక్రాంతి పండుగ ఈ నినాదాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.

PM Modi: కేంద్ర మంత్రి నివాసంలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న ప్రధాని మోదీ..
Pm Modi Sankranthi
Follow us
Srikar T

|

Updated on: Jan 15, 2024 | 11:06 AM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ అనే నినాదాన్ని విలపించారు. సంక్రాంతి పండుగ ఈ నినాదాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు ప్రధాని మోదీ. మోదీతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సినీ నటి మీనా పాల్గొన్నారు. పొంగల్ తన చేతుల మీదుగా తయారు చేస్తూ దాని విశేషాన్ని తెలిపారు ప్రధాని మోదీ. పొంగల్ సమయంలో కొత్త పంట చేతికి వస్తుందని దానిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి తమ భక్తిని చాటుకుంటారన్నారు. దీని వెనుక అన్న దాతలకు దేశంలో ఇచ్చే గౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు.

ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, సంపద, సుఖశాంతులు విరజిల్లాలని కోరుకున్నారు. అలాగే సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, రకరకాల రంగులతో ఇంటి లోగిళ్లలో రంగవల్లులు వేసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. దీని వెనుక గల ఆంతర్యాన్ని వివరించారు. ముగ్గుల్లోని చుక్కలను కలిపినట్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాలు ఒకరితో ఒకరు అనుసంధానం అయితే దేశానికి కొత్త శక్తి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఈ పండుగకు తొలి ప్రాధాన్యం ఇస్తారని, ఆ ప్రాంతంలోని రైతులు చిరుధాన్యాలను పండించడంలో ప్రతిభావంతులని కీర్తించారు. దేశంలో కాశీ – తమిళ్, సౌరాష్ట్ర – తమిళ్ అనే భావన ఈ సంక్రాంతికి కనిపిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..