Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అంబానీ.! బిలియనీర్ల జాబితాలో 16వ స్థానం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మరోసారి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 8,73,815 కోట్ల నికర విలువతో 2024 ఏడాది మొదట్లోనే రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో అంబానీ చోటు సంపాదించుకున్నారు. ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రికార్డులకెక్కింది. ఇక, ప్రపంచ సంపన్నుల జాబితా విషయానికి వస్తే ముకేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలోని 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో మొత్తం 12 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మరోసారి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 8,73,815 కోట్ల నికర విలువతో 2024 ఏడాది మొదట్లోనే రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో అంబానీ చోటు సంపాదించుకున్నారు. ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రికార్డులకెక్కింది. ఇక, ప్రపంచ సంపన్నుల జాబితా విషయానికి వస్తే ముకేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలోని 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో మొత్తం 12 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. ముకేశ్ అంబానీ చివరిసారి 2021లో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పడిపోవడంతో ఆ జాబితా నుంచి బయటకు వచ్చారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ 240.9 బిలియన్ డాలర్ల నికర విలువతో ఇప్పటికీ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇక, ఇండియాలో అత్యంత సంపన్నుల్లో ముకేష్ అంబానీ తర్వాత గౌతం అదానీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ 79.4 బిలియన్ డాలర్లతో 16వ స్థానంలో ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

