Amazon: అమెజాన్ అడవుల్లో బయటపడిన 2500 ఏళ్లనాటి ప్రాచీన నగరం.
అమెరికాలోని అమెజాన్ మహారణ్యంలో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఇది 2,500 ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇది ఎవరి కంట పడకుండా గుప్తంగా ఉన్న ఈ నగరాన్ని.. తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన సీమల్లో దీనిని గుర్తించారు. ఇళ్లు, భవనాలు, వీధులను కలుపుతూ నెట్‌వర్క్ రోడ్లు, కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ నగరాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ రోజుల్లోనే అవి ఆధునిక నిర్మాణాలు అని చెప్పదగిన విధంగా ఆ కట్టడాలు ఉన్నాయి. ఫ్రాన్స్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.
అమెరికాలోని అమెజాన్ మహారణ్యంలో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఇది 2,500 ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇది ఎవరి కంట పడకుండా గుప్తంగా ఉన్న ఈ నగరాన్ని.. తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన సీమల్లో దీనిని గుర్తించారు. ఇళ్లు, భవనాలు, వీధులను కలుపుతూ నెట్‌వర్క్ రోడ్లు, కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ నగరాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ రోజుల్లోనే అవి ఆధునిక నిర్మాణాలు అని చెప్పదగిన విధంగా ఆ కట్టడాలు ఉన్నాయి. ఫ్రాన్స్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నగరం దాదాపు 1000 ఏళ్ల పాటు మనుగడ సాగించి, ఆపై క్రమంగా అంతరించిపోయినట్టు భావిస్తున్నారు. ఈ పురాతన నగరంలో ఎంతమంది జీవించారనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ… సుమారుగా లక్ష మంది వరకు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఓ విమానంలో లేజర్ సెన్సర్లు ఉంచి అమెజాన్ అడవులపై దాదాపు 300 చదరపు కిలోమీటర్ల మేర శోధించారు. ఈ లేజర్ సెన్సర్లు సేకరించిన సమాచారంతో సమన్వయం చేసుకుంటూ తవ్వకాలు సాగించిన పురావస్తు పరిశోధకులు దట్టమైన అడవి కింది భాగంలో ఉన్న ఈ నగరాన్ని గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

