PM Modi – SemiconIndia: సెమీకండక్టర్ హబ్‌గా భారత్.. ఆరు నెలల్లోనే పరిశ్రమలకు అనుమతులు

|

Apr 30, 2022 | 2:08 PM

PM Modi inaugurates SemiconIndia 2022: అత్యున్నత సాంకేతికత, అధిక నాణ్యత, విశ్వసనీయత సూత్రాల ఆధారంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే సెమీకండక్టర్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని..

PM Modi - SemiconIndia: సెమీకండక్టర్ హబ్‌గా భారత్.. ఆరు నెలల్లోనే పరిశ్రమలకు అనుమతులు
Pm Modi
Follow us on

PM Modi inaugurates SemiconIndia 2022: అత్యున్నత సాంకేతికత, అధిక నాణ్యత, విశ్వసనీయత సూత్రాల ఆధారంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే సెమీకండక్టర్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఆ దిశగా అడుగులు వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకమైన సెమికాన్ ఇండియా 2022 ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సెమీకండక్టర్ పరిశ్రమ కోసం పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే ఉద్దేశ్యంతో పరిశ్రామిక వేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రభుత్వాన్ని ఒకచోట చేర్చిన సెమికాన్ ఇండియా మొదటి ఎడిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే భారతదేశం అన్నింటికి అత్యంత అనుకూలమైన దేశమని ప్రధాని పేర్కొన్నారు. సహాయక విధాన వాతావరణం ద్వారా తాము వీలైనంత వరకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

పారిశ్రామికవేత్తలు, తయారీదార్లకు కేంద్రం విధానపరంగా పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తోందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలంటూ ప్రధాని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, సవాళ్లను స్వీకరించే విషయంలో భారత్‌ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లో చిప్ తయారీకి ప్రభుత్వం అనుమతినిస్తుందని పేర్కొన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్‌ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్‌ డాలర్ల విలువైన సెమికండక్లర్ల అవసరం ఉందన్నారు. దీనికోసం ఆచరణాత్మక సూచనలు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు.

దీనిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. టీవీ9 నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ దేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీదారులకు వచ్చే 6-8 నెలల్లో అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వైష్ణవ్ తెలిపారు.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను సాధించడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. బెంగళూరు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యపై కూడా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 12 నెలల్లో ప్రభుత్వం తన హామీలను నెరవేరుస్తుందని చెప్పారు.

1.53 లక్షల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్‌ చిప్‌, డిస్‌ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఐదు కంపెనీల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

PM Narendra Modi: ప్రజా భాషలోనే న్యాయం అందాలి.. కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించండి: ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటోన్న బీఎస్ఈ చీఫ్‌.. ఎందుకో తెలుసా?