మోడీ గుజరాత్ పర్యటన… మురుగునీటి శుద్ధీకరణ, విద్యుత్ ఉత్పత్తి, పాల పరిశ్రమ పనులకు శంకుస్థాపనలు…

భారత ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లో డిసెంబర్ 15న పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మోడీ గుజరాత్ పర్యటన... మురుగునీటి శుద్ధీకరణ, విద్యుత్ ఉత్పత్తి, పాల పరిశ్రమ పనులకు శంకుస్థాపనలు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 15, 2020 | 7:21 AM

భారత ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లో డిసెంబర్ 15న పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట కచ్ ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ మురికి నీటిని మంచి నీటిగా మార్చే ప్లాంట్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా త్వరలో రోజుకు 10 కోట్ల లీటర్ల మురుగు నీటిని మంచి నీటిగా మార్చనుంది.

పునరుత్పాదక విద్యుత్ పరిశ్రమ….

కచ్ జిల్లా విఘాకోట్ గ్రామంలో పునరుత్పాదకత కలిగిన విద్యుత్ పరిశ్రమకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. గాలి ద్వారా విద్యుత్ తయారు చేసే ఈ పరిశ్రమను దాదాపు 72,600 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. అంతేకాకుండా సౌర విద్యుత్ ఉత్పత్తిని ఈ పార్కులో చేపట్టనున్నారు. అంతేకాకుండా అత్యాధునిక సాంకేతికత కలిగిన పాల పరిశ్రమకు స్థాపించన చేయనున్నారు. ఈ పరిశ్రమను దాదాపు 121 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నారు. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ఈ పరిశ్రమంలో ప్రాసెస్ చేయనున్నారు.