PM Modi: ప్రధాని మోడీ ఆ ఆలయానికి కేవలం 21 రూపాయలే విరాళంగా ఇచ్చారా? అసలు విషయం ఇదిగో..

|

Sep 28, 2023 | 4:28 PM

ఇందులో ప్రధాని మోడీ పేరుతో ఉన్న ఎన్వలప్‌ కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్‌రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్‌ను తెరచి చూడగా ఇందులో కేవలం 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. 20 రూపాయల నోటుతో పాటు ఒక రూపాయి నాణెం కవర్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ వీడియోను సామజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ చేస్తున్నారు

PM Modi: ప్రధాని మోడీ ఆ ఆలయానికి  కేవలం 21 రూపాయలే విరాళంగా ఇచ్చారా? అసలు విషయం ఇదిగో..
PM Narendra Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్‌ భిల్వారా దేవ్‌ నారాయణ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. దేవ్‌ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోడీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే హుండీలో విరాళాలు కూడా సమర్పించారు. తాజాగా ఈ దేవాలయం హుండీని తెరిచారు.ఈ దేవాలయం హుండీని కేవలం ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సోమవారం (సెప్టెంబర్ 25)న హుండీ తెరిచారు. ఆలయ అధికారులు, పూజారులు హుండీ విరాళాలను లెక్కించారు. అయితే ఇందులో ప్రధాని మోడీ పేరుతో ఉన్న ఎన్వలప్‌ కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్‌రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్‌ను తెరచి చూడగా ఇందులో కేవలం 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. 20 రూపాయల నోటుతో పాటు ఒక రూపాయి నాణెం కవర్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ వీడియోను సామజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ చేస్తున్నారు. అలాగే మోడీపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు మోడీపై ధీరజ్‌ గుజ్జర్‌ మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదనిపిస్తోంది. ఎందుకంటే దేవాలయంలో ఉన్న హుండీలో మోడీ ఎలాంటి ఎన్వలప్‌ కవర్లు వేయలేదు. కేవలం నగదు మాత్రమే దేవునికి విరాళంగా సమర్పించారు. ఇది పై వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ నాయకులు కూడా ఇదే అంశాన్ని తీసుకుని ప్రతిపక్ష నాయకులకు కౌంటర్లు వేస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీపై కొందరు అనవసరంగా బురద జల్లుతున్నారంటూ ధీటుగా బదులిస్తున్నారు.

 ప్రధాని మోడీ హుండీలో నగదు మాత్రమే వేశారు.. వీడియో ఇదుగో.. 

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..