ఒలంపిక్స్‌లో హాకీ జట్టు విజయాన్ని దేశం సెలబ్రేట్ చేసుకుంటుంటే.. విపక్షాల తీరుపై ప్రధాని మోడీ చురక

| Edited By: Janardhan Veluru

Aug 05, 2021 | 5:58 PM

ఇండియా ఓ వైపు టోక్యో ఒలంపిక్స్ లో హాకీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే మరో వైపు కొందరు 'సెల్ఫ్ గోల్స్ క్రియేట్ చేయడంలో బిజీగా ఉన్నారని ప్రధాని మోదీ పరోక్షంగా విపక్షాలనుద్దేశించి విమర్శించారు.

ఒలంపిక్స్‌లో హాకీ జట్టు విజయాన్ని దేశం సెలబ్రేట్ చేసుకుంటుంటే.. విపక్షాల తీరుపై ప్రధాని మోడీ చురక
Modi
Follow us on

ఇండియా ఓ వైపు టోక్యో ఒలంపిక్స్ లో హాకీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే మరో వైపు కొందరు ‘సెల్ఫ్ గోల్స్ క్రియేట్ చేయడంలో బిజీగా ఉన్నారని ప్రధాని మోదీ పరోక్షంగా విపక్షాలనుద్దేశించి విమర్శించారు. పెగాసస్ పై నిన్న ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో వారిని ఒక రోజుపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రతిపక్షాలు రభస సృష్టిస్తున్నాయని..ఇలా ఈ దేశ ప్రగతిని అడ్డుకోవడానికి వారు చేయవలసిందంతా చేస్తున్నారని మోదీ ఆరోపించారు. పార్లమెంటును కూడా వారు అడ్డుకుంటున్నారని.. కానీ ప్రజలు దీన్ని సహించడం లేదని ఆయన చెప్పారు. ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నా.. ఇండియా వాటిని దాటి ముందుకెళ్తోందని..నెగెటివ్ భావాలు కలిగినవారు ఈ దేశ అభివృద్ధిని అడ్డుకోజాలరని ఆయన పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ లో మనం 50 కోట్లు దాటామని, జులైలో మన జీఎస్టీ వసూళ్లను చూడాలని ఆయన అన్నారు. ఇది మనం పాజిటివ్ దిశగా ఎలా వెళ్తున్నామో సూచిస్తోందన్నారు. అభివృద్ధి ప్రక్రియను ఎవరూ అడ్డుకోజాలరన్నారు. ఒలంపిక్స్ లో జర్మనీపై భారత హాకీ జట్టు విజయం సాధించగానే మోదీ..ఇండియన్ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. 41 ఏళ్ళ తరువాత ఒలంపిక్స్ లో మనం మెడల్ సాధించగలిగామన్నారు. ఈ నెల 15 న మనమంతా కలుద్దాం అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి ఇండియా గర్విస్తోందన్నారు. అటు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ తదితరులు కూడా భారత హాకీ జట్టును అభినందించారు. మన ప్లేయర్లు ఆడిన తీరు ప్రశంసనీయమన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Luck: లక్ అంటే ఇది.. గింగరాలు తిరుగుతూ వచ్చి ఆమె కాళ్ల ముందు వాలింది

Minister Harish Rao: హుజూరాబాద్‌లో బిజేపీ,కాంగ్రెస్‌ మధ్య చీకటి ఒప్పందం.. దళితుల ఓట్లను చీల్చేందుకు కుమ్మక్కు..ఈటలపై మంత్రి హరీశ్‌ రావు