PM Modi: విజ్ఞానశాస్త్రంలో టాప్ 10 దేశాల సరసన భారత్‌.. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ..

విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ప్రయోగశాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని తెలిపారు.

PM Modi: విజ్ఞానశాస్త్రంలో టాప్ 10 దేశాల సరసన భారత్‌.. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 03, 2023 | 12:17 PM

Indian Science Congress -2023: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం ఉదయం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ.. భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 108వ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. మహారాష్ట్రలోని రాష్ట్రసంత్‌ తుకాదోజీ మహారాజ్‌ నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 108వ సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ప్రయోగశాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని తెలిపారు. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ మిల్లెట్స్ (తృణ ధాన్యాల) సంవత్సరంగా ప్రకటించిందని, భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్పిని సైన్స్ వినియోగంతో మరింత మెరుగుపరచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగడం.. సైన్స్ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశంలో మనకు రెండు విషయాలు కనిపించాయని.. డేటా, టెక్నాలజీ అని వివరించారు. ఇవి భారతదేశ విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలవన్నారు. డేటా విశ్లేషణ వేగంగా ముందుకు సాగుతోంది. ఇది సమాచారాన్ని అంతర్దృష్టిగా, విశ్లేషణను కార్యాచరణ జ్ఞానంగా మార్చడంలో సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. సైన్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ నిలవడం గర్వకారణమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం స్టార్టప్‌లలో భారతదేశం ప్రపంచంలోని మొదటి 3 దేశాలలో ఒకటిగా ఉందని ప్రధాని మోడీ వివరించారు. 2015 వరకు 130 దేశాల గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 81వ స్థానంలో ఉన్నామని.. కానీ 2022లో 40వ స్థానానికి చేరుకున్నామని 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చి.. మరింత అభివృద్ధికి దోహదపడాలని ప్రధాని మోడీ సూచించారు. నూతన ఆవిష్కరణలతో శాస్త్ర సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..