AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: రైతులకు ముఖ్య గమనిక.. ఆ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్లే.!

PM Kisan Yojana Updates: రైతులకు చాలా ముఖ్యమైన వార్త ఇది. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలకమైన అంశం.

PM Kisan Yojana: రైతులకు ముఖ్య గమనిక.. ఆ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్లే.!
Modi
Shiva Prajapati
|

Updated on: May 09, 2022 | 6:48 PM

Share

PM Kisan Yojana Updates: రైతులకు చాలా ముఖ్యమైన వార్త ఇది. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలకమైన అంశం. త్వరలో మీ ఖాతాలో 11వ విడత సొమ్ము రూ.2 వేలు జమ కాబోతున్నాయి. ఇప్పటికే 10వ విడత డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. 11వ విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, ప్రధాన మంత్రి కిసాన్ యోజన 2021 పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రైతులు 11వ విడత డబ్బులు పొందాలంటే.. కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. కేవైసీనీ పూర్తి చేయడానికి గడువును కూడా పెట్టింది.

ఈ కేవైసీ తప్పనిసరి.. కేవైసీ గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని కూడా కేవైసీని హాయిగా పూర్తి చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కింతకాలం క్రితం కిసాన్ యోజన పోర్టల్‌లో ఇ కేవైసీ సదుపాయాన్ని నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. 11 విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఇ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే.. డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇ కేవైసి ఎలా చేయాలి? పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆన్‌లైన్ KYC అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆధార్ ఆధారిత OTP ప్రమాణీకరణ కోసం రైతులకు కిసాన్ కార్నర్‌లోని e KYC ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. అయితే, బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయడం కోసం మీ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొని e KYC ప్రక్రియను ఎలా పూర్తి చేయవచ్చో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

ఇ కేవైసి ప్రక్రియ ఇదీ.. 1. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ సహాయంతో ఇంట్లో కూర్చొని e KYC చేయవచ్చు. 2. దీని కోసం ముందుగా మీరు https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి. 3. ఇప్పుడు ఈ పేజీకి కుడి వైపున ట్యాబ్‌లు కనిపిస్తాయి. 4. E KYC అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 5. ఇక్కడ మీరు మీ e KYC ప్రక్రియను పూర్తి చేయాలి. 6. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించండి.

ఇ కేవైసికి చివరి తేదీ ఎప్పుడు? e KYC కోసం చివరి తేదీ ముందుగా మార్చి 31 ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ గడువును మే 2022 వరకు పొడిగించారు.

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు