అసదుద్దీన్ ఓవైసీపై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ పిల్

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సుప్రీంలో ఓ పిల్‌ దాఖలైంది. యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వీరేశ్‌ శాండిల్యా..

అసదుద్దీన్ ఓవైసీపై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ పిల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2020 | 7:32 AM

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సుప్రీంలో ఓ పిల్‌ దాఖలైంది. యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వీరేశ్‌ శాండిల్యా ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంపై ఓవైసీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోదీ హాజరుపై ఓవైసీ పలు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు పవిత్రతను, విజ్ఞతను తప్పుబడుతూ.. గత జూలై నెలలో 30వ తేదీన ఓ ఛానెల్‌లో అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై పిటిషనర్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు.