వామ్మో రక్త పింజర.. ఎన్ని పిల్లల్ని పెట్టిందో చూడండి..!

సాధారణంగా పాములు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. అయితే రక్త పింజర పాము మాత్రం అలా కాదు. అది డైరక్ట్‌గా పిల్లల్ని కంటుంది. అయితే ఒకేసారి ఐదారు పిల్లల్ని కంటుంది. ఒక్కోసారి పది పిల్లల వరకు కూడా..

వామ్మో రక్త పింజర.. ఎన్ని పిల్లల్ని పెట్టిందో చూడండి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2020 | 4:00 AM

సాధారణంగా పాములు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. అయితే రక్త పింజర పాము మాత్రం అలా కాదు. అది డైరక్ట్‌గా పిల్లల్ని కంటుంది. అయితే ఒకేసారి ఐదారు పిల్లల్ని కంటుంది. ఒక్కోసారి పది పిల్లల వరకు కూడా కంటుంది. అయితే తమిళనాడులో మాత్రం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ జైలులో ఓ రక్త పింజర ఒకే ఈతలో ఏకంగా ముప్పై మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకే సారి ఇలా 33 పిల్లల్ని పెట్టడం అత్యంత అరుదైన సంఘటన అంటూ జూ అధికారులు తెలిపారు. అయితే ఆ పాము పిల్లల్ని అన్నింటినీ స్థానికంగా ఉన్న అనైకట్టి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు