అగ్రరాజ్యంలో 5 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు

అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ 5 మిలియన్లకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు..

అగ్రరాజ్యంలో 5 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 6:04 AM

అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ 5 మిలియన్లకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా మరో 58,173 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన అమెరికాలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4.9 మిలియన్లు దాటింది. ఈ విషయాన్ని జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికాలో తొలి కేసు జనవరి 22వ తేదీన నమోదైందని.. అయితే 198 రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం రోజుకు అరలక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదే విధంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతే.. మరో రెండు మూడు రోజుల్లో 5మిలియన్ల మార్క్‌ను దాటేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత బ్రెజిల్‌, భారత్‌లు ఉన్నాయి.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు