కరోనా బారిన పడ్డ మరో కేంద్ర మంత్రి
తాజాగా వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరికి కోవిడ్ పాజిటివ్ సోకింది. తమకు వైరస్ వచ్చినట్లు స్వయంగా కేంద్ర మంత్రే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని..
మరో కేంద్ర మంత్రికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. రాజకీయ ప్రముఖులను కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు పొలిటికల్ లీడర్స్, సినీ, క్రీడా ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ మహమ్మారి ఎటాక్ చేస్తూనే ఉంది. అయితే సామాన్యుల కంటే ఎక్కువగా వీరే వైరస్ బారిన పడుతూండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరికి కోవిడ్ పాజిటివ్ సోకింది. తనకు వైరస్ సోకినట్టు స్వయంగా కేంద్ర మంత్రే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. భయపడాల్సిన విషయం ఏమీ లేదు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పుర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అలాగే గత కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్నవారు కూడా పరీక్షలు నిర్వహించుకోండి’ అని పేర్కొన్నారు. కాగా మంత్రి కుటుంబ సభ్యులకు కూడా అధికారులు టెస్టులు నిర్వహిస్తున్నారు.
Read More: పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. పాడెక్కాడు!