విజ‌య‌వాడ హోట‌ల్ ప్రమాద‌ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ ఆరా

విజయవాడ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్‌లో ఒక హోటల్లో జరిగిన ప్రమాద ఘటపై సీఎం జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు జ‌గ‌న్‌కు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా […]

విజ‌య‌వాడ హోట‌ల్ ప్రమాద‌ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ ఆరా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2020 | 8:31 AM

విజయవాడ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్‌లో ఒక హోటల్లో జరిగిన ప్రమాద ఘటపై సీఎం జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు జ‌గ‌న్‌కు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం జ‌గ‌న్‌ అధికారులను ఆదేశించారు.

Read More:

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో కేంద్ర మంత్రి

పెళ్లి పీట‌లెక్కాల్సిన వ‌రుడు.. పాడెక్కాడు!