Breaking News
  • అమరావతి: హైకోర్టును ఆశ్రయుంచిన ఆన్ -ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం. ప్రభుత్వం జారీ చేసిన 155 మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ.. 155 మెమోను సస్పెండ్ చేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు.. ప్రవేట్ స్కూల్లోని విద్యార్థుల డేటాను యాజమాన్యానికి తెలియ కుండా తొలగిస్తున్నారన్న న్యాయవాది.. పూర్తి వివరాలతో కౌoటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా..
  • హేమంత్ హత్య కేసు: ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసాము. నిందితులు లక్ష్మ రెడ్డి,యుగేంద్రర్ రెడ్డి ని 6 రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు. ఈ రోజు నిందితులను కస్టడీకి తీసుకుంటాం.
  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పెరుగుతున్న భారతరత్న డిమాండ్లు. రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన నటి, మాజీ ఎంపీ జయప్రద. భారతరత్న బాలుకి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్న జయప్రద. సినీ సంగీతానికి, భారత చలనచిత్ర పరిశ్రమకు బాలు ఎనలేని సేవలు చేశారని లేఖలో పేర్కొన్న జయప్రద.
  • నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం... టీఆర్ఎస్ నేతల పకడ్బందీ వ్యూహం. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వరుస సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి ‌మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు. పోలింగ్ ‌నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం.
  • బయటపడుతున్న ఎస్బీ సిఐ చంద్రకుమార్ అరాచకాలు. లైంగిక వేదింపులు జరిపిన సిఐ చంద్రకుమార్ పై చర్యలు తీసుకోవట్లేదని బాధితురాలు అవేదన. సర్టిఫికెట్ మిస్సింగ్ కేసులో సిఐకి పరిచయమైన మహిళ . సాయం అడిగిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సిఐ చంద్రకుమార్. వనస్థలిపురం పిఎస్ లో సిఐ చంద్రకుమార్ పై కేసు. నగ్నంగా ఉన్న వీడియోలు మహిలకు పంపి సిఐ వేదిస్తున్నాడని మహిళ పిర్యాదు. సిఐ పై కఠిన చర్యలు తీసుకోవట్లేదని మహిళ పలు సాక్షాలు మీడియాకు విడుదల.
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాసపెట్టాలి. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు పూర్తి చేయాలి. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి, సోషల్‌ ఆడిట్‌ చేయాలి, మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి.
  • ఫారెన్ ఇంగ్లీష్ యూనివర్సిటీ వి సి పేరుతో నకిలీ ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు. యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు తాను మీటింగ్ లో ఉన్నానని.. అర్జెంటుగా అమెజాన్ కుపన్స్ కొనాలని మెయిల్ పంపించిన సైబర్ నేరగాళ్లు. అలర్ట్ అయిన ఉద్యోగులు వీసీ సురేష్ కుమార్ కు సమాచారం ఇవ్వడంతో.. తాను అట్లాంటిది ఏమీ పంపించలేదని చెప్పిన విసి. హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

పెళ్లి పీట‌లెక్కాల్సిన వ‌రుడు.. పాడెక్కాడు!

శుభ ముహూర్తంలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు అదే సమయానికి పాడెక్కాడు. బాజా.. భజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లిపండిట్లో చావుడప్పులు, ఆర్తనాదాలు ఉసూరుమనిపించాయి. అటు వధువు కుటుంబంలో విషాదం అలముకుంది. శనివారం రాత్రి 11.గంటల 27నిమిషాలకు పెళ్లి...

Bridegroom died with heart attack before marriage in Mahabubnagar, పెళ్లి పీట‌లెక్కాల్సిన వ‌రుడు.. పాడెక్కాడు!

శుభ ముహూర్తంలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు అదే సమయానికి పాడెక్కాడు. బాజా.. భజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లిపండిట్లో చావుడప్పులు, ఆర్తనాదాలు ఉసూరుమనిపించాయి. అటు వధువు కుటుంబంలో విషాదం అలముకుంది. శనివారం రాత్రి 11.గంటల 27నిమిషాలకు పెళ్లి… 10 గంటలకు వరుడు మృతి. ఇంతటి విషాద సంఘటన గురించి ఎక్కడైనా విన్నారా..? వరుడు మృతి చెందడంతో అటు వధువు ఇంట్లో కూడా విషాదం అలుముకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు నరేష్ (25)కి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమయింది. 08వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు వీరి వివాహం. వరుడి ఇంటి వద్దే పెళ్లి వేడుక నిర్వహిస్తుండడంతో బంధు మిత్రులు వధువు తీసుకువచ్చేందుకు వెళ్లారు.

ఇంతలోనే వరుడు నరేష్ తనకు చాత కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో.. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుడు ఆ నిద్రలోనే అనంతలోకాల్లో కలిసిపోయాడు. పడుకున్న నరేష్ లేవకపోవడంతో.. మ‌ళ్లీ ఏమ‌యింద‌ని డాక్ట‌ర్‌ని పిలిచి టెస్ట్ చేయ‌గా మృతి చెందాడ‌ని తెలిపారు. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అటు వధువు ఇంటివద్ద కూడా విషాదం అలుముకుంది.

Related Tags