PIB Fact Check: కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా? అసలు నిజమేంటంటే..

|

Sep 25, 2022 | 9:07 PM

PIB Fact Check: దేశంలోని 5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మెసేజ్ దేశ వ్యాప్తంగా..

PIB Fact Check: కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా? అసలు నిజమేంటంటే..
Laptop
Follow us on

PIB Fact Check: దేశంలోని 5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మెసేజ్ దేశ వ్యాప్తంగా చాలా మంది పోన్లకు వస్తోంది. అది నమ్మి జనాలు మోసపోతున్నారు. కొందరు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి.. ల్యాప్‌టాప్ కోసం దరఖాస్తు తీసుకోవాలని కోరుతున్నారు. మీ ఫోన్‌కి కూడా ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా? అయితే, ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకోండి..

ఉచిత ల్యాప్‌టాప్ వాగ్దానం..

ఇవి కూడా చదవండి

‘ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం చేసినట్లుగా దేశ వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా విద్యార్థులకు ఉచితంగా ఈ ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.’ అని చాలా మంది ఫోన్లకు మెసేజ్‌ వస్తోంది. అయితే, ఈ మెసేజ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి స్కీమ్ ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ సందేశానికి సంబంధించి నిజమేంటో వివరిస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించింది.

అబద్దం అని తేల్చిన PIB..

కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన PIB ఈ వైరల్ సందేశం పక్కా ఫేక్ అని తేల్చింది. మెసెజ్‌ను చెక్ చేసిన పిఐబి.. మోసపూరితమైన ఈ మెసేజ్‌ను ఎవరూ నమ్మొద్దని తెలిపింది. సర్క్యూలేట్ అవుతున్న ఈ మెసేజ్‌ను లింక్ చేస్తూ ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ఏదీ అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ పోస్ట్ ఫేక్‌ అని, ఎవరూ ఆ మెసేజ్‌ను విశ్వసించొద్దని స్పష్టం చేసింది. పొరపాటున ఆ మెసేజ్‌లోని లింక్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేస్తే మీ ఖాతాల్లోని డబ్బులు ఖాళీ అవుతాయని స్పష్టం చేసింది.

ఫేక్ మెసేజ్‌లపై ఇలా ఫిర్యాదు చేయండి..

ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా తప్పుదారి పట్టించే వార్తల గురించి తెలుసుకోవాలనుకుంటే PIB ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. ఎవరైనా తప్పుదోవ పట్టించే వార్తల స్క్రీన్ షాట్స్, ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్ట్, URL ని వాట్సప్ నెంబర్ 8799711259 లో PIB FactCheckకి పంపవచ్చు లేదా pibfactcheck@gmail.comకి మెయిల్ చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..