కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ఐటీ రూల్స్‌పై ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసిన ప్రజలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కేంద్రం నింబంధనలు సవరించిందని, సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. అంతటితో ఆగకుండా మొదట టీవీ నెట్‌వర్క్‌లను స్వాధీనం చేసుకున్న కేంద్రం ఇప్పుడు సోషల్ మీడియాను సైతం అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ విరుచుకుపడ్డారు.
అయితే కపిల్ సిబల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారికంగా స్పందించింది. కపిల్ చేసిన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌లో ఎలాంటి కొత్త నిబంధనలు జోడించలేదని, కపిల్ సిబల్ ఆరోపణలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రూపంలో స్పస్టతనిచ్చే ప్రయత్నం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Former Union IT Minister Kapil Sibal in a statement claims that under the amended IT rules, people making defamatory statements will be prosecuted#PIBFactCheck
◼️This claim is Misleading
◼️The amended IT Rules have not added any new provision for prosecution pic.twitter.com/e0n2y9z7bb
— PIB Fact Check (@PIBFactCheck) October 29, 2022
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త ఐటీ రూల్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో యూజర్ల భద్రత లక్ష్యంగా కొత్త ఐటీ రూల్‌ను తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా ప్రకారం.. సోషల్ మీడియా కంటెంట్‌పై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా గ్రివెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..