Aadhar Card: ఆధార్‌ కార్డు ఉన్న వాళ్లకు కేంద్రం రూ. 5 లక్షల రుణం.. ఈ వార్త నిజమేనా.?

|

Nov 21, 2022 | 2:25 PM

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచారం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే నెట్టింట చక్కర్లు కొడుతోన్న వార్తలన్నీ నిజమేనా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా సైబర్‌ నేరాలు పెరుగుతోన్న ఇటీవలి కాలంలో తప్పుడు సమాచారంతో నెటిజన్లకు గాలం వేస్తున్నారు.,,

Aadhar Card: ఆధార్‌ కార్డు ఉన్న వాళ్లకు కేంద్రం రూ. 5 లక్షల రుణం.. ఈ వార్త నిజమేనా.?
Aadhar Number
Follow us on

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచారం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే నెట్టింట చక్కర్లు కొడుతోన్న వార్తలన్నీ నిజమేనా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా సైబర్‌ నేరాలు పెరుగుతోన్న ఇటీవలి కాలంలో తప్పుడు సమాచారంతో నెటిజన్లకు గాలం వేస్తున్నారు. పలానా లింక్‌ను క్లిక్‌ చేస్తే బహుమతి వస్తుంది అంటూ అసత్య ప్రచారాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆధార్‌ కార్డు ఉన్న వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం రూ. 4,78,000 రుణం ఇస్తుందని ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

అయితే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్‌ వేదికగా ఈ వార్తలను కొట్టిపారేసింది. ఆధార్‌ కార్డు దారులకు కేంద్రం లోన్‌ ఇస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి తప్పుడు మెసేజ్‌లను ఎవరికీ ఫార్వర్డ్ చేయకండి. అలాగే మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవద్దు అంటూ పీఐబీ వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

దీంతో గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్త పూర్తిగా ఫేక్‌ అని తేలింది. ఇదిలా ఉంటే ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ తెగ వైరల్‌ అయ్యింది. లింక్‌లను క్లిక్‌ చేసి సమాచారాన్ని అందిస్తే లక్కీ డ్రా పేరుతో కూడా కొన్ని మెసేజ్‌లను ఫోన్‌లకు పంపించారు సైబర్‌ నేరగాళ్లు. అనుమానస్పదంగా ఉన్న లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో లింక్‌ చేయకూడదని సైబర్‌ నిపుణులు చెబుతూనే ఉన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..