Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌! ఎట్టకేలకు తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎప్పటినుంచంటే..

|

Jan 23, 2023 | 3:12 PM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎట్టకేలకు తగ్గనున్నాయి. ఇన్నాళ్లు చుక్కలు చూపిన ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి వ్యక్తం చేశారు..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌! ఎట్టకేలకు తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎప్పటినుంచంటే..
Petrol, Diesel Price Will Be Reduced
Follow us on

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎట్టకేలకు తగ్గనున్నాయి. ఇన్నాళ్లు చుక్కలు చూపిన ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి వ్యక్తం చేశారు. పెట్రోల్‌ విక్రయాలపై అంతర్జాతీయంగా ధరలు తగ్గితే చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు చవిచూసే అవకాశం ఉందని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) వంటి ఆయిల్ కంపెనీలు తమ అండర్ రికవరీలను ముగిస్తే, ఇంధన ధరలు తగ్గుతాయన్నారు. ఐతే ధరల తగ్గింపు విషయంలో చమురు కంపెనీలపై ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని, ఓఎంసీలు తమంతట తామే ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి పూరీ వెల్లడించారు.

కాగా గతేడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం వల్ల ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. గత ఏడాది మే 21న పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని వరుసగా రూ.8, రూ.6లకు తగ్గించడం వల్ల చమురు కంపెనీలు నష్టాలు చవిచూసేలా చేసింది. ఐతే నాటి నుంచి నేటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దీంతో రవాణా ఛార్జీలు భారీగా పెరిగి సామాన్యులు తల్లడిల్లిపోయారు. ఐతే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగినా.. ఆ భారం వినియోగదారులపై పడకుండా ఓఎంసీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి హర్దీప్ పూరి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.