అర్థరాత్రి కడుపు నొప్పితో విలవిల్లాడిన 8వ తరగతి విద్యార్థిని.. కారణం తెలిసి హడలిపోయిన అధికారులు..!

జార్ఖండ్‌లోని గుమ్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కడుపు నొప్పితో బాధపడుతున్న 8వ తరగతి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడంలో స్కూల్ యాజమాన్యంతో పాటు..

అర్థరాత్రి కడుపు నొప్పితో విలవిల్లాడిన 8వ తరగతి విద్యార్థిని.. కారణం తెలిసి హడలిపోయిన అధికారులు..!
Minor Pregnant
Follow us

|

Updated on: Jan 23, 2023 | 3:28 PM

జార్ఖండ్‌లోని గుమ్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కడుపు నొప్పితో బాధపడుతున్న 8వ తరగతి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడంలో స్కూల్ యాజమాన్యంతో పాటు, విద్యాశాఖ షాక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఆదివారం రాత్రి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దాంతో హాస్టల్ సిబ్బంది.. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అమ్మాయిని పరిశీలించిన వైద్యులు ప్రెగ్నెంట్‌గా గుర్తించి.. డెలివరీ చేశారు. మైనర్ బాలికకు ఆడబిడ్డ జన్మించింది.

మైనర్ బాలిక ప్రసవించడంతో విద్యాశాఖలో కలకలం రేగింది. అసలేం జరిగిందని ఆరా తీయగా.. విషయం బయటపడింది. కారణం అమ్మాయి బంధువులే అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మాయిని స్కూల్‌లో చేర్పించే సమయానికే గర్భవతి అని విచారణలో తేల్చారు.

ఊళ్లో మామ వరుస వ్యక్తితో ప్రమే వ్యవహారం..

బాలిక.. తన ఊర్లో మామ వరుస అయ్యే యువకుడితో ప్రేమాయణం నడిపింది. ఆ విషయంలోనే యువకుడి కుటుంబం, అమ్మాయి కుటుంబం మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి. పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో అమ్మాయిని ఊరుకి దూరంగా స్కూల్‌లో చదివించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. బాలికను గుమ్లా కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించారు. అయితే, బాలిక అప్పటికే గర్భవతి అని కుటుంబ సభ్యులకు తెలిసినా.. విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి తెలుపలేదని విచారణలో తేల్చారు అధికారులు.

ఇవి కూడా చదవండి

సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మైనర్..

ప్రసవించిన బాలిక, ఆమె బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, వీరిద్దరినీ ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంచారు. ఇక బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. గర్భవతిని చేసిన వ్యక్తిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు గుమ్లా పోలీసులు. ప్రస్తుతం సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకుంటామని గుమ్లా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!