Petrol and Diesel Price Cuts: పెట్రోల్, డీజిల్‌ అసలు ధర ఎంత?.. ప్రభుత్వాలు వేస్తున్న వ్యాట్ ఎంత?.. పూర్తి వివరాలు మీకోసం..

|

Nov 04, 2021 | 7:34 PM

Petrol and Diesel Price: దేశంలో తయారైన ఏదైనా వస్తువు ఉత్పత్తి దశలో కానీ, ఉత్పత్తి పూర్తయిన తర్వాత కానీ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

Petrol and Diesel Price Cuts: పెట్రోల్, డీజిల్‌ అసలు ధర ఎంత?.. ప్రభుత్వాలు వేస్తున్న వ్యాట్ ఎంత?.. పూర్తి వివరాలు మీకోసం..
Follow us on

Petrol and Diesel Price: దేశంలో తయారైన ఏదైనా వస్తువు ఉత్పత్తి దశలో కానీ, ఉత్పత్తి పూర్తయిన తర్వాత కానీ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. విలువను బట్టి, లేదా నిర్థిష్టమైన మొత్తాన్ని పన్ను కింద వసూలు చేస్తారు. ఇలాగే పెట్రోల్‌, డీజిల్‌ మీద ఎక్సైజ్‌ డ్యూటీ కింద సుంకాన్ని వసూలు చేస్తుంది కేంద్రం. అయితే గతంలో ఇది తక్కువగా ఉండేది. కానీ, 2020 మే తర్వాత ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2020 మే 5న లీటర్‌కు 38 రూపాయల 78 పైసలకు పెంచింది కేంద్రం. దీంతో అప్పటి నుంచి పెట్రో ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై 32 రూపాయల 90 పైసలు సుంకం విధిస్తోంది కేంద్రం. ఇప్పుడు 5 రూపాయల సుంకాన్ని తగ్గించడంతో కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకం 27 రూపాయల 90 పైసలకు తగ్గింది. అటు డీజిల్‌పై ఉన్న 32 రూపాయల 80 పైసలుగా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని 10 రూపాయలు తగ్గించడంతో ఇప్పుడు 21 రూపాయల 80 పైసలకు తగ్గింది. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే.. 2014లో డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 3 రూపాయల 56 పైసలుగా ఉండేది. ఆ తర్వాత ట్యాక్స్‌ పెరుగుతూ వచ్చింది.

ఇదిలాఉంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు.. రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ విధిస్తాయి. అయితే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ట్యాక్స్‌ విధిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్‌పై వ్యాట్ రూ. 35.2, డీజిల్‌పై రూ.27 చొప్పున ఉంది. తాజాగా తగ్గించిన ధరలతో కలిపి హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 108.20 ఉంటే.. డీజిల్ లీటర్ ధర రూ. 94.62 గా ఉంది. ఇకపోతే.. ఎక్సైజ్ సుంకం తగ్గింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు నడిచాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 12 రూపాయల చొప్పున వ్యాట్ తగ్గించింది. ఇక గుజరాత్‌, కర్నాటక, గోవా, త్రిపుర, మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై 7 రూపాయల చొప్పున వ్యాట్‌ తగ్గించాయి.

పెట్రోల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి…
పెట్రోల్ బేస్ ధర రూ. 47.28.
కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూ. 32.90 రూపాయలు.
రవాణా ఖర్చు రూ. 0.30.
డీలర్ కమిషన్ రూ. 3.9
రాష్ట్రాల వారీగా వ్యాట్ సపరేట్‌గా ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో వ్యాట్ రూ. 25.31.

డీజిల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
డీజిల్ బేస్ ధర రూ. 49.36.
కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూ. 31.80.
రవాణా ఖర్చు రూ. 0.28.
డీలర్ కమిషన్ రూ. 2.61.
ఢిల్లీలో వ్యాట్ రూ. 14.97(వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో వ్యాట్ రేట్ ఉంటుంది.)

Also read:

Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..

T20 World Cup 2021: నాలుగేళ్ల వనవాసం ముగిసింది.. ఆనాటి పరిస్థితులెంతో కఠినం: భావోద్వేగానికి గురైన భారత స్టార్ బౌలర్..!

Gold Seized: విశాఖపట్నం రైల్వే స్టేషన్ భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!