లోన్ కట్టకుంటే రికవరీ ఏజెంట్లు వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారా ?.. ఇకనుంచి అలా చెల్లదు

చాలామంది తమ అవసరాల కోసం లోన్లు తీసుకొని వాహనాలు కొనుక్కుంటారు. కానీ కొన్నిసార్లు డబ్బులు కట్టలేకపోవడంతో రికవరీ ఏజేంట్ల వచ్చి డబ్బులు కట్టాలంటూ అడుగుతారు. ఒకవేళ కస్టమర్లు కట్టకపోతే కండబలమున్న మనుషుల్ని పంపి వారి వాహనాలను బలవంతంగా లాక్కెళ్లిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి.

లోన్ కట్టకుంటే రికవరీ ఏజెంట్లు వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారా ?.. ఇకనుంచి అలా చెల్లదు
Car

Updated on: May 25, 2023 | 5:59 AM

చాలామంది తమ అవసరాల కోసం లోన్లు తీసుకొని వాహనాలు కొనుక్కుంటారు. కానీ కొన్నిసార్లు డబ్బులు కట్టలేకపోవడంతో రికవరీ ఏజేంట్ల వచ్చి డబ్బులు కట్టాలంటూ అడుగుతారు. ఒకవేళ కస్టమర్లు కట్టకపోతే కండబలమున్న మనుషుల్ని పంపి వారి వాహనాలను బలవంతంగా లాక్కెళ్లిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.

లోన్ తీసుకున్న వాహన యజమానులు ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే కండబలమున్న మనుషుల్ని పంపి వాహనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ఇలా చేస్తే ఆ వ్యక్తి జీవించే హక్కు, జీవనోపాధిని కాసరాయటమేనని పేర్కొంది. లోన్ రికవరీని రాజ్యంగ పరిధిలోని చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై రూ.50 వేలు జరిమాన విధిస్తామని హెచ్చరించ్చింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం