Covid-19 Effect: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగిపోతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ పెరుగుతున్న కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైరస్ కారణంగా విమాన సర్వీసులు సైతం రద్దు అయ్యాయి. తాజాగా విమానాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేదంటే విమానం ఎక్కేందుకు అనుమతి ఉండదని తెలిపింది.
► విమాన ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే భౌతిక దూరం పాటించాలి.
► విమాన ప్రవేశద్వారాల వద్ద సీఐఎస్‌ఎఫ్, పోలీసు సిబ్బంది ప్రయాణికులను గమనించాలి. మాస్క్‌లేని వారి అనుమతించరాదు.
► విమానాశ్రయం ప్రాంగణంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి.
► విమానంలో ఎక్కత తర్వాత అందరూ మాస్క్‌లు ధరించారా.?లేదా చూడాలి. సిబ్బంది హెచ్చరించినా.. ప్రయాణికుడు మాస్క్ ధరించకపోతే టేకాఫ్‌కు ముందే విమానం నుంచి దించేయాలి.
► ప్రయాణ సమయంలో విమానంలో కోవిడ్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించినట్లయితే వారిని నిషేధిత జాబితాలోని ప్రయాణికుడిగా పరిగణించాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఇవీ చదవండి: Kidney Dialysis Hospital: దేశంలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రి.. ఉచితంగా డయాలసిస్, భోజనం.. ఎక్కడో తెలుసా..?
Covid-19 Effect: ఆ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మళ్లీ మూతపడిన పాఠశాలలు..ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం