#Corona effect వారంతా పరీక్షలు లేకుండానే పాస్

కరోనా ప్రభావం చూపని రంగం అంటూ ఏదీ కనిపించడం లేదు. దేశం యావత్తు 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ ప్రజల సౌకర్యార్థం నిర్ణయాలు తీసుకుంటున్నాయి స్థానిక ప్రభుత్వాలు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం అక్కడి పాఠశాల విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది.

#Corona effect వారంతా పరీక్షలు లేకుండానే పాస్
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 4:09 PM

Tamilnadu government sensational decision: కరోనా ప్రభావం చూపని రంగం అంటూ ఏదీ కనిపించడం లేదు. దేశం యావత్తు 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ ప్రజల సౌకర్యార్థం నిర్ణయాలు తీసుకుంటున్నాయి స్థానిక ప్రభుత్వాలు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం అక్కడి పాఠశాల విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది.

తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి తమిళనాడులో. దాంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. దానికి తోడు కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ తరహా వాతావరణం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది తమిళనాడులోని పళని స్వామి ప్రభుత్వం.

తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు శరవేగమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి పళని స్వామి ప్రభుత్వం. కరోనా కలకలంతో పాఠశాలలన్నింటికి మార్చ్ 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన నేపధ్యంలో 1వ తరగతి నుంచి 9వ తరగతుల పరీక్షలను రద్దు చేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు సర్కార్. విద్యార్థులు అందరూ పరీక్షలు లేకుండానే ఉతీర్ణత సాధించినట్లుగా భావించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.