మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని బల్హర్షా రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో కొంత భాగం కూలింది. ఆదివారం (నవంబర్ 27) జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 10-15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి వంతెనపై నుంచి ట్రాక్‌పై పడిపోయారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు ట్రాక్ దాటుతున్నట్లు మీడియాలో చూడచ్చు. ఈ ఫుట్‌ఓవర్ వంతెన ఒకటి, రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతుంది.
ఈరోజు సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో నాగ్‌పూర్ డివిజన్‌లోని బల్హర్షా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రీ-కాస్ట్ స్లాబ్‌లో కొంత భాగం కూలిపోయిందని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు. ఈ ఘటనలో 4 మందికి గాయాలు కాగా, ప్రథమ చికిత్స అనంతరం అందరినీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra’s Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, మధ్యస్థంగా గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించిందని సీపీఆర్వో తెలిపారు. క్షతగాత్రులను త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం