Parliament Session: నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్న కేంద్రం..

|

Jul 18, 2022 | 6:12 AM

Parliament Session: నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను...

Parliament Session: నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్న కేంద్రం..
Follow us on

Parliament Session: నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా 24 బిల్లులు ఉండనున్నాయి. ఈ సెషన్‌లో లోక్ సభ 18 రోజుల పాటు పనిచేయనుంది.

సమావేశాలు మొత్తం 108 గంటల పాటు జరగనున్నాయి. ఇక రాష్ట్రపతి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సెషన్ లోనే ఉపరాష్ట్రపతి ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. సభలో పాటించాల్సిన విధానాలు, మాట్లాడే మాటలకు, నిరసనలకు సంబంధించి పలు నిషేదాజ్జలను లోక్ సభ సెక్రటేరియట్ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు..

ఇదిలా ఉంటే బీజేపీని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్‌ సమావేశాలను అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపథ్‌, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం వంటి అంశాలను లేవనెత్తేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సి అంశాలపై కాంగ్రెస్‌ నేతలు ఇది వరకే సమావేశమైన విషయం తెలిసిందే. మరి ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు, అధికార పక్షం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..