Children Infected With Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతోపాటు థర్డ్ వేవ్ వస్తే.. కరోనా ప్రభావం ఎక్కువగా పిల్లలపై చూపుంతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే నిపుణలు సూచనల ప్రకారం థర్డ్ వేవ్ ముప్పు ప్రారంభమైందన్న ఊహగానాలు మొదలయ్యాయి. ఇటీవల పిల్లలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ముఖ్యంగా బెంగళూరులో ఇలాంటి కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 11 వరకు 0–9 ఏళ్లలోపు పిల్లలకు 210 మంది, 10–18 మధ్య 333 మంది వైరస్ బారినపడినట్లు బెంగళూరు అధికారులు వెల్లడించారు.
ఈ కేసుల్లో 270 మంది బాలికలు, 273 మంది బాలురు ఉన్నారు. ఇదిలా ఉండగా 6–15 ఏళ్ల వయసు మధ్య వారితోపాటు 20 ఏళ్లలోపు యువకులు, నవజాత శిశువుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. ఎక్కువ మంది పిల్లలు కరోనా బారిన పడుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. అయితే.. సాధ్యమైనంత వరకు పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపవద్దని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
కాగా.. కర్ణాటకలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,669 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న 22 మంది మరణించారు. 1,672 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,26,401కి పెరగగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 28,66,739 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 36,933 మంది కరోనా మహమ్మారితో మరణించారు. వీటిల్లో బెంగళూరులో 425 కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
Also Read: