పూజారిని కిడ్నాప్ చేసి లాక్కెళ్లిన భక్తులు.. ఆ తర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్…

పూజలు చేయాలంటే పూజారులు కావాల్సిందే. ప్రతి ఊర్లో దాదాపుగా పూజారులు ఉండే ఉంటారు. అయితే కొన్ని నగరాల్లో పూజారుల కొరత ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఢిల్లీలో అయితే కార్లు కొంటే కారు పూజచేసేందుకు ఉచితంగా పూజారిని సమకూర్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే వెస్ట్ బెంగాల్‌లో కూడా కొన్ని చోట్ల పూజారుల కొరత ఏర్పడిందట. దీంతో ఉన్న పూజారులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో గుడిలో పూజలు, పెళ్లిల్లు, గృహ ప్రవేశాలు చేసేందుకు సామాన్య […]

పూజారిని కిడ్నాప్ చేసి లాక్కెళ్లిన భక్తులు.. ఆ తర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 31, 2020 | 2:15 PM

పూజలు చేయాలంటే పూజారులు కావాల్సిందే. ప్రతి ఊర్లో దాదాపుగా పూజారులు ఉండే ఉంటారు. అయితే కొన్ని నగరాల్లో పూజారుల కొరత ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఢిల్లీలో అయితే కార్లు కొంటే కారు పూజచేసేందుకు ఉచితంగా పూజారిని సమకూర్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే వెస్ట్ బెంగాల్‌లో కూడా కొన్ని చోట్ల పూజారుల కొరత ఏర్పడిందట. దీంతో ఉన్న పూజారులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో గుడిలో పూజలు, పెళ్లిల్లు, గృహ ప్రవేశాలు చేసేందుకు సామాన్య జనం పూజారి లేక ఇబ్బందులు పడుతున్నారట. గుడిలో పూజలు చేయడానికి కూడా పూజారులు కరువయ్యారట కొన్నిచోట్ల. దీంతో కొందరు భక్తులు.. దేవుడికి పూజ చేసేందుకు పూజారి లేకపోతే.. దారిన పోయే ఓ పూజారిని కొంతమంది భక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. దీనికి కారణం గురువారం వసంత పంచమి కావడంతో.. గుడిలో పూజలు చేసేందుకు పూజారులు కరువయ్యారట. ఉన్న పూజారులకు భారీగా డిమాండ్ చేయడంతో.. ఓ గుడి వద్ద ఉన్న భక్తులకు ఏం చెయ్యాలో తోచక.. చివరకు ఓ పూజారిని కిడ్నాప్ చూసి.. బలవంతంగా గుడిలోకి లాక్కెళ్లారు. దీనికి సబంధించిన ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది.

కాగా.. వెస్ట్ బెంగాల్‌లో వసంత పంచమి వచ్చిందంటే పూజార్లకు ప్రతిఏటా డిమాండు బాగా ఉంటుంది. ప్రజలు తమ వీధుల్లో సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. అలా చేస్తే మంచి జ్ఞానం, విద్యా, కళలు, బుద్ధి లభిస్తాయని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే, భక్తులు ఆ పూజారిని అలా లాక్కుని వెళ్లి మరీ సరస్వతి పూజ చేయించారట. ఈ పూజారి కిడ్నాప్ తతంగాన్ని తరుణ్‌దాస్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.