కోవిద్ పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వ్యాక్సినేషన్ జోరు పెరగాలని సూచన…

ప్రపంచ దేశాల్లో కోవిద్ కేసులు ఇంకా తగ్గలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. చాలా దేశాల్లో ఇంకా ఈ కేసులు ఉన్నాయని, ఈ వైరస్ తగ్గిందనడానికి ఆధారాలు కనబడడం లేదని ఆమె చెప్పారు.

కోవిద్ పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వ్యాక్సినేషన్ జోరు పెరగాలని సూచన...
Pandemic Is Not Slowing Dow
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 10, 2021 | 11:15 AM

ప్రపంచ దేశాల్లో కోవిద్ కేసులు ఇంకా తగ్గలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. చాలా దేశాల్లో ఇంకా ఈ కేసులు ఉన్నాయని, ఈ వైరస్ తగ్గిందనడానికి ఆధారాలు కనబడడం లేదని ఆమె చెప్పారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, మందకొడిగా వ్యాక్సినేషన్ జరగడం, ఆంక్షల ఎత్తివేత ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. ప్రతి 6 దేశాలకు గాను 5 దేశాల్లో కోవిద్ కేసులు పెరుగుతున్నాయి….ఉదాహరణకు ఆఫ్రికాలో గత 2 వారాల్లో మరణాల సంఖ్య 30 నుంచి 40 శాతం పెరిగింది అని ఆమె వెల్లడించారు. ఒరిజినల్ వైరస్ కి గురి అయిన ఓ వ్యక్తి..తన వల్ల మరో ముగ్గురికి దీన్ని అంటిస్తే,, డెల్టా వేరియంట్ కి గురి అయిన వ్యక్తి కారణంగా మరో ఎనిమిది మందికి ఇది సోకుతోందని సౌమ్యా స్వామినాథన్ చెప్పారు.అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కేసులు పెరుగుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పలు దేశాల్లో ఇప్పటికీ ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత ఉన్నట్టు తెలిసిందన్నారు. భారత్ బయో టెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ డేటా సంతృప్తికరంగా ఉందని, దీన్ని తమ సంస్థ త్వరలో ఆమోదించే సూచనలు ఉన్నాయన్నారు.

ఇక ఇండియాలో గత 24 గంటల్లో 42,766 కోవిద్ కేసులు నమోదు కాగా-1206 మంది కోవిద్ రోగులు మృతి చెందారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో ఇవి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిమాచల్ లోని ముస్సోరీ వంటి హిల్ స్టేషన్లు, ప్రముఖ నగరాల్లోని మార్కెట్లలో జనం గుంపులుగుంపులుగా మళ్ళీ చేరడంతో కేసులు పెరుగుతున్నట్టు ఈ శాఖ భావిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తాం…. అక్కడ అధికారం మాదే.. బీజేపీ నేత బీ.ఎల్. సంతోష్

Google Pixel 6: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. అత్యాధుని ఫీచర్స్‌

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!