AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఇండియన్‌ ఆర్మీకి చిక్కిన పాకిస్థాన్‌ పైలట్‌..? అసలు నిజం ఇదే..

గురువారం (మే 8) రాత్రి భారత్‌పై ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియన్‌ ఆర్మీ పాక్‌ దాడిని ధీటుగా తిప్పికొట్టింది. గగనతలంలోనే పాకిస్థాన్‌ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లు, మిస్సైల్స్‌ను భారత్ ఆర్మీ సమర్ధవంతంగా కూల్చివేసింది. అలాగే పాకిస్థాన్‌కు చెందిన మూడు ఫైటర్‌ జైట్లను సైతం కూల్చివేసింది. వీటిల్లో ఓ యుద్ధ విమానంలో ఉన్న..

Fact Check: ఇండియన్‌ ఆర్మీకి చిక్కిన పాకిస్థాన్‌ పైలట్‌..? అసలు నిజం ఇదే..
India Pakistan War
Srilakshmi C
|

Updated on: May 09, 2025 | 7:13 PM

Share

న్యూఢిల్లీ, మే9: ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌.. గురువారం (మే 8) రాత్రి భారత్‌పై ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియన్‌ ఆర్మీ పాక్‌ దాడిని ధీటుగా తిప్పికొట్టింది. గగనతలంలోనే పాకిస్థాన్‌ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లు, మిస్సైల్స్‌ను కూల్చివేసింది. పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన మూడు ఫైటర్‌ జైట్లను సైతం కూల్చివేసింది. వీటిలో ఎఫ్‌ 16, రెండు జేఎఫ్‌ 17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. భారత్‌ ఆర్మీ కూల్చిన ఎఫ్‌ 16 యుద్ధ విమానంలోని పాకిస్థాన్‌ పైలట్‌ను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  అయితే ఈ దాడిలో పాక్‌ పైలట్ పట్టుబడిన విషయాన్ని ఇండియన్‌ ఆర్మీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన కేంద్రం ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది.

రాత్రిపూట తీసిన ఈ వైరల్ ఫోటోలో యూనిఫాం ధరించిన సిబ్బంది గుంపుకు చెందింది. అయితే అది అస్పష్టంగా ఉండటంతో.. ఈ ఫొటో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో పట్టుబడిన పాకిస్తాన్ వైమానిక దళ పైలట్ ఇతడే అంటూ వైరల్ అవుతోంది. బూమ్ సంస్థ ఈ వైరల్ ఫోటో 2016 నాటిదని తేల్చిచెప్పింది. ఈ ఫోటో టర్కీలోని దియార్‌బాకిర్‌లో టర్కిష్ F-16 ఫైటర్ జెట్ కూలిపోయినప్పుడు తీసినదని, అది భారత్‌కి సంబంధించినది కాదని స్పష్టం చేసింది.

అయితే పాక్ దాడిని భారత రక్షణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. లాహోర్, ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు  నిర్ధారించాయి. జమ్మూ, పఠాన్‌కోట్‌, ఉధమ్‌పూర్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. దాడి సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డ్రోన్లు, మిస్సైల్‌తో ఈ దాడులకు తెగబడిందని వెల్లడించింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

గురువారం జరిగిన పాక్‌ దాడిలో రాజస్థాన్ జైసల్మేర్ సెక్టార్‌లోని పోఖ్రాన్ లాఠీ సమీపంలో ఒక జెట్‌ను కూల్చివేసినట్లు సమాచారం. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లోపల పాకిస్తాన్ వైమానిక దళం AWACS ను కూల్చివేసినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌లో భారత్ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ఎనిమిది పాకిస్తాన్ క్షిపణులను అడ్డుకుని నాశనం చేయడంతో జమ్మూ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడులతో బారత్ తన పూర్తి స్థాయి వైమానిక రక్షణ, డ్రోన్ నిరోధక వ్యవస్థలను సక్రియం చేసింది.

దీర్ఘ-శ్రేణి S-400 క్షిపణులను L-70 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు, రష్యన్ నిర్మిత ZSU-23-4 షిల్కా వ్యవస్థల వంటి వ్యూహాత్మక క్లోజ్-రేంజ్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు మోహరించింది. జమ్మూ, జైసల్మేర్, సాంబా, తంగ్‌ధర్, అఖ్నూర్‌లలో పాక్‌ సంబంధిత బహుళ డ్రోన్, క్షిపణి దాడుల అనంతరం ఈ మోహరింపులు జరిగాయి. బోఫోర్స్ తయారు చేసిన L-70 యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ గన్.. నిమిషానికి 330 రౌండ్ల వరకు పేల్చగలదు. ఇది 4 వేల మీటర్ల లక్ష్యాన్ని కూడా చేధించగలదు. నాలుగు 23MM ఆటోకానన్‌లకు ప్రసిద్ధి చెందిన షిల్కా సిస్టమ్‌ నిమిషానికి 4 వేల రౌండ్ల లక్ష్యాన్ని చేరుకోగలదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us