గూఢచర్యం చేస్తూ పట్టుబడిన పాకిస్తాన్ అధికారులు

భారత్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ ఉద్యోగులు తమ వక్ర బుద్ధి చూపించారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు భారత్‌పై గూఢచర్యానికి పాల్పడుతుండగా.. నిఘావర్గాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. కీలక సమాచారాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సిబ్బందిని ఢిల్లీలోని పాక్ హైకమీషన్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరిని ఆబిద్‌ హుస్సేన్‌, తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. వీరిద్దరూ పాకిస్తాన్ హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరికి పాక్ గూఢచారి సంస్థ(ఐఎస్ఐ)తో నేరుగా సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనతో […]

గూఢచర్యం చేస్తూ పట్టుబడిన పాకిస్తాన్ అధికారులు
Follow us

|

Updated on: Jun 01, 2020 | 12:42 PM

భారత్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ ఉద్యోగులు తమ వక్ర బుద్ధి చూపించారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు భారత్‌పై గూఢచర్యానికి పాల్పడుతుండగా.. నిఘావర్గాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. కీలక సమాచారాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సిబ్బందిని ఢిల్లీలోని పాక్ హైకమీషన్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరిని ఆబిద్‌ హుస్సేన్‌, తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. వీరిద్దరూ పాకిస్తాన్ హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరికి పాక్ గూఢచారి సంస్థ(ఐఎస్ఐ)తో నేరుగా సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనతో వారిద్దరినీ పర్సోనా-నాన్‌ గ్రాటాగా ప్రకటించారు. అంటే.. వారికి ఇకపై భారత్‌లోకి వచ్చేందుకు అనుమతి ఉండదు. ఈ ఇద్దరిని పాకిస్తాన్‌కు తిప్పిపంపించారు.

భారత భద్రతాకు సంబంధించిన అత్యున్నత కీలక పత్రాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. వీరి నుంచి ఫేక్ ఆధార్ కార్డులతోపాటు మరికొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ ఆదేశాల మేరకే వీరికి ఇక్కడే నియమించినట్లుగా గుర్తించారు. ఇలాంటి నేరాలకు పాల్పడటం పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ సిబ్భందికి ఇది కొత్తేమి కాదు. 2016లో కూడా ఇలాంటి నేరం చేస్తూ దొరికి పోయారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు