గిల్గిత్‌-బాల్దిస్తాన్‌పై పాక్‌ చేస్తోన్న కుట్రలను ఖండించిన భారత్‌

గిచ్చి కయ్యం పెట్టుకోవడం పాకిస్తాన్‌కు మహా సరదా.. సరదా కాదు దురద.. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నానికి ఒడిగడుతున్నదా దేశం.. భారత్‌తో గొడవ పెట్టుకునేందుకు కుట్రలు చేస్తోంది..

గిల్గిత్‌-బాల్దిస్తాన్‌పై పాక్‌ చేస్తోన్న కుట్రలను ఖండించిన భారత్‌
Follow us

|

Updated on: Nov 02, 2020 | 11:12 AM

గిచ్చి కయ్యం పెట్టుకోవడం పాకిస్తాన్‌కు మహా సరదా.. సరదా కాదు దురద.. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నానికి ఒడిగడుతున్నదా దేశం.. భారత్‌తో గొడవ పెట్టుకునేందుకు కుట్రలు చేస్తోంది.. కుతంత్రాలు పన్నుతోంది.. ఇందుకు వివాదాస్పద గిల్గిత్‌-బాల్దిస్తాన్‌ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటోంది.. ఆ ప్రాంతాన్ని నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.. దాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చేసి తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలన్నది పాన్‌ పన్నాగం.. ఇటీవల కావాలనే అక్కడ పర్యటించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ త్వరలో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రకటించారు.. నిజానికి ఆ ప్రాంతంపై పాకిస్తాన్‌ ఎలాంటి హక్కు లేదు.. అది భారత్‌లో అంతర్భాగం.. ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కాలరాసే అధికారం పాకిస్తాన్‌కు కొంచెం కూడా లేదు.. నిన్న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చెప్పింది కూడా ఇదే! గిల్గిత్‌-బాల్దిస్తాన్‌ను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు.. వెంటనే అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవాలంటూ చెప్పారు.. ఆక్రమిత ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని పాకిస్తాన్‌కు అల్టిమేటం ఇచ్చారు. అసలు ఏ లెక్కన చూసినా గిల్గిత్‌-బాల్దిస్తాన్‌ ప్రాంతం భారత్‌దే! అది జమ్ముకశ్మీర్‌లో అంతర్భాగం.. అయితే దేశ విభజన జరిగిన కొన్ని రోజులకే పాకిస్తాన్‌ దొంగ దారిన ఆక్రమించిన 78, 114 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే ఇది కూడా ఉంది.. ఇప్పటి వరకు పాలనాపరమైన అవసరాల కోసం వాడుకున్న పాకిస్తాన్‌ ఇప్పుడు ఏకంగా ప్రావిన్స్‌గా మార్చాలనుకుంటోంది. ఈ నెల 15న ఎన్నికలను నిర్వహిస్తోంది.. ప్రస్తుతం పాకిస్తాన్‌లో నాలుగు ప్రావిన్స్‌లు ఉన్నాయి.. సింధ్‌, పంజాబ్‌, బలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫంక్తున్వాలలో ఏ ఒక్క ప్రావిన్సూ సంతోషంగా లేదు.. బలూచిస్తాన్‌లో అయితే పాకిస్తాన్‌ ప్రభుత్వ అణచివేత ధోరణిపై జనం గళమెత్తుతున్నారు.. ఇప్పుడు గిల్గిత్‌-బాల్దిస్తాన్‌లో అయిదు ప్రావిన్స్‌గా మార్చాలనే ఇమ్రాన్‌ కుట్రలు సాగవు.. ఈ విషయంలో భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్‌గా ఉంది.. అంగుళం భూమి కూడా కోల్పోకూడదనే గట్టి పట్టుదలతో ఉంది. జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసినప్పుడే భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. గిల్గిత్‌-బాల్దిస్తాన్‌ ప్రాంతాన్ని లద్దాక్‌ అంతర్భాగంగా మ్యాప్‌లో చూపించింది.. ఇక అప్పట్నుంచి పాకిస్తాన్‌కు నిద్రకూడ పట్టడం లేదు.. యుద్ధమంటూ వస్తే భారత్‌తో చావుదెబ్బ తినడం గ్యారంటీ అని పాకిస్తాన్‌కు తెలుసు.. అందుకే ఇలా కుట్రలు చేస్తూ వస్తోంది.. పాకిస్తాన్‌ చర్యలను ఎప్పటికప్పుడు భారత్‌ ఖండిస్తూ వస్తోంది.. అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ను దోషిగా నిలపగలిగింది.. ఇప్పుడు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత్ ఉంది.. ఆ ముచ్చట కూడా త్వరలో తీరవచ్చు..