AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పహల్గామ్‌ ఉగ్రదాడిపై రాబర్ట్‌ వాద్రా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

పహల్గామ్‌ ఉగ్రదాడిపై రాబర్ట్‌ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం హిందుత్వ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తోందన్నారు. దీని వల్ల మైనార్టీలు ఇబ్బందిపడుతున్నారన్నారు. మసీదులపై సర్వేలు చేయడం, రోడ్లపై నమాజ్ చేయొద్దని చెప్పడం వంటివి అస్థిరతకు దారితీస్తున్నాయన్నారు. ఇది వివిధ వర్గాల ప్రజల మధ్య విభజనకు కారణమవుతున్నాయని వాద్రా అభిప్రాయపడ్డారు.

పహల్గామ్‌ ఉగ్రదాడిపై రాబర్ట్‌ వాద్రా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Robert Vadra
Balaraju Goud
|

Updated on: Apr 23, 2025 | 5:20 PM

Share

పహల్గామ్‌ ఉగ్రదాడిపై రాబర్ట్‌ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం హిందుత్వ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తోందన్నారు. దీని వల్ల మైనార్టీలు ఇబ్బందిపడుతున్నారన్నారు. మసీదులపై సర్వేలు చేయడం, రోడ్లపై నమాజ్ చేయొద్దని చెప్పడం వంటివి అస్థిరతకు దారితీస్తున్నాయన్నారు. ఇది వివిధ వర్గాల ప్రజల మధ్య విభజనకు కారణమవుతున్నాయని వాద్రా అభిప్రాయపడ్డారు.

పహల్గామ్ ఉగ్రదాడిని వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఖండించారు. బైసరన్ వ్యాలీలో భయానక దాడిని వాద్రా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ANI తో మాట్లాడుతూ, ఈ సంఘటనను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలు ఎటువంటి సమస్యను సృష్టించవని, పౌరులపై దాడి చేయడం ద్వారా దానిని సమస్యగా మార్చడం నిజంగా పిరికితనం అని ఆయన అన్నారు.

అయితే, మతం, రాజకీయాలు వేర్వేరు అని, వాటిని వేరుగా ఉంచాలని రాబర్ట్ వాద్రా అన్నారు. ఉగ్రవాదులు మొదట ప్రజల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి, ఆపై ముస్లింలను ఇక్కడ అణచివేస్తున్నారని భావించి వారిని చంపారన్నారు. తాను దీనికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. అయితే మనం ఐక్యంగా, లౌకికంగా మారే వరకు బలహీనతలు, ఈ సమస్యలు పొరుగు దేశాలకు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన అన్నారు. ఈ ఉగ్రవాద సంఘటన తర్వాత తాను చాలా బాధపడ్డానని, ఈ ఉగ్రవాద చర్యలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

మన దేశంలో, ఈ ప్రభుత్వం హిందూత్వ గురించి మాట్లాడుతుండటం, మైనారిటీలు అసౌకర్యంగా, ఆందోళన చెందుతున్నారని వాద్రా అన్నారు. ఈ ఉగ్రవాద చర్యను విశ్లేషిస్తూ, మన దేశంలో హిందువులు, ముస్లింల మధ్య విభజన తలెత్తిందని అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల హిందువులు, ముస్లింలందరికీ సమస్యలు సృష్టిస్తున్నారని అలాంటి సంస్థలు భావిస్తాయని ఆయన అన్నారు. గుర్తింపును చూసి, ఆపై ఒక్కొకరిని చంపడం, ఇది ప్రధానమంత్రికి ఒక సందేశం అంటూ వారి వ్యాఖ్యలు చూస్తుంటే, ముస్లింలు బలహీనంగా భావిస్తున్నారని వాద్రా అన్నారు. మైనారిటీలు బలహీనంగా భావిస్తున్నారని రాబర్ట్ వాద్రా అన్నారు. ఇది వివిధ వర్గాల ప్రజల మధ్య విభజనకు కారణమవుతున్నాయని వాద్రా అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..