
సిద్ధరామయ్య ఎమన్నారు…
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన శనివారం మైసూరులో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నట్టు తెలుస్తోంది. భారత్ కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని. ప్రజలకు భద్రత కల్పించాలని, తాము యుద్దానికి అనుకూలంగా లేనట్టు ఆయన తెలిపారు. పహల్గామ్ దాడి ఘటనలో కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం ఉందని కూడా సిద్ధరామయ్య ఆరోపించారు. “పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సింది.
పాకిస్థాన్ మీడియాలో సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రచారం..
అయితే పాకిస్థాన్‌తో యుద్దం అవసరం లేదన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలను పాకిస్థాన్ కు చెందిన ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కావడం రాజకీయ దుమారానికి దారీ తీసింది. పాకిస్థాన్ మీడియాలో సిద్దరామయ్య వ్యాఖ్యలు హైలెట్ కావడంతో.. దీనిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా మండిపడింది. స్ధానిక ప్రతిపక్ష నాయుడు ఆర్ ఆశోక్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సిద్ధరామయ్యను ‘పాకిస్థాన్ రత్న’గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చి, వారి ఉగ్రవాద చర్యలను సమర్థిస్తున్నారని ఆరోపించారు. “40 ఏళ్ల అపార రాజకీయ అనుభవం ఉన్న, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యకు ఇలా మాట్లాడడం ఏంటని మండిపడ్డారు.
"ಪಾಕಿಸ್ತಾನ ರತ್ನ" ಸಿಎಂ @siddaramaiah ನವರೇ,
ತಮ್ಮ ಬಾಲಿಶ, ಅಸಂಬದ್ಧ ಹೇಳಿಕೆಗಳಿಂದ ಈಗ ರಾತ್ರೋರಾತ್ರಿ ಪಾಕಿಸ್ತಾನದಲ್ಲಿ ವರ್ಲ್ಡ್ ಫೇಮಸ್ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದೀರಿ. ತಮಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಮುಂದೆಂದಾದರೂ ತಾವು ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಭೇಟಿ ಕೊಟ್ಟರೆ ತಮಗೆ ರಾಜಾತಿಥ್ಯ ಗ್ಯಾರೆಂಟಿ. ಪಾಕಿಸ್ತಾನದ ಪರ ವಕಾಲತ್ತು ವಹಿಸಿದ ಮಹಾನ್ ಶಾಂತಿದೂತ ಎಂದು… pic.twitter.com/OjcCkrEMtb
— R. Ashoka (@RAshokaBJP) April 27, 2025
తన వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య వివరణ…
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో యుద్దం అవసరం లేదని, జమ్మూకాశ్మీర్‌లో భద్రతా చర్యలను కఠినతరం చేయాలని తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.పాకిస్తాన్‌తో యుద్ధం ఉండకూడదని తాను ఎప్పుడూ చెప్పలేదని.. యుద్ధం అనివార్యమైతే అది జరుగుతుందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..