PM Modi: వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం! రామయ్య కుటుంబానికి..
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి చెట్లను నాటిన వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య ప్రకృతి పట్ల అపారమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను చూపించారని మోదీ కొనియాడారు.

జీవితాంతం మొక్కలు నాటుతూ వన జీవిగా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. మొక్కలు నాటి వాటిని జీవితాంతం రక్షించారు. రామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు మోదీ. చెట్లను నాటి, వాటి రక్షణ కోసం వనజీవి రామయ్య తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. రామయ్య అవిశ్రాంత కృషి.. ప్రకృతి పట్ల ప్రేమ, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందన్నారు.
కాగా వనజీవి రామయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జీవితాంతం మొక్కలు నాటి పెంచిన రామయ్య.. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. కోటి మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వనజీవి రామయ్య మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల ప్రేమికుడు రామయ్య మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. చెట్లను నాటి, వాటి రక్షణ కోసం వనజీవి రామయ్య తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. రామయ్య అవిశ్రాంత కృషి.. ప్రకృతి పట్ల ప్రేమ, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందన్నారు.
దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…
— Narendra Modi (@narendramodi) April 12, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..