Padma Awards 2023 : పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు నేలపై విరిసిన పద్మాలు

|

Jan 26, 2023 | 8:04 AM

పద్మ పురస్కారాలు ఎంపికైన తెలుగువారికి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, సినీ హీరో చిరంజీవి, అనేకమంది ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో చేసిన విశేష కృషితో అవార్డులు అందుకొని తెలుగుజాతి గర్వించేలా చేశారని కొనియాడారు.

Padma Awards 2023 : పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు నేలపై విరిసిన పద్మాలు
Padma Awards
Follow us on

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం..వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగురాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి. ఇక ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్‌, సమాజ్‌వాద్‌ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ, ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌, గుజరాత్‌కు చెందిన బాలకృష్ణ జోషీ, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్ విభాగంలో శ్రీనివాస్‌ వర్థన్‌కు కేంద్రం పద్మ విభూషణ్‌ ప్రకటించింది.

తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి, కమలేశ్‌ డి పటేల్‌ను పద్మభూషణ్‌ వరించాయి. వీరితోపాటు కర్నాటకు చెందిన ఎస్‌ఎల్‌ భైరప్ప,సుధామూర్తి, మహారాష్ట్ర నుంచి కుమార మంగళం బిర్లా, దీపక్‌ ధార్‌, సుమన్‌ కళ్యాణ్‌పూర్‌, తమిళనాడు నుంచి వాణీ జయరాం, ఢిల్లీ నుంచి కపిల్‌ కపూర్‌కు పద్మభూషణ్‌ వరించాయి.

ఇక ఏపీ, తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మోదడుగు విజయ్‌ గుప్తా , వైద్య రంగంలో పసుపులేటి హన్మంతరావు, ,సాహిత్యం,విద్య రంగంలో బి.రామకృష్ణారెడ్డిని పద్మశ్రీ వరించింది. ఏపీలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఏపీ నుంచి కీరవాణి, గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర, సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, కోటా సచ్చితానంద, ప్రకాశ్‌చంద్ర సూద్‌, సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ వరించాయి. తానూ చేసిన పనికి గుర్తింపుతోపాటు ఎంతో శ్రమ ఉందన్నారు సంకురాత్రి చంద్రశేఖర్‌.

ఇవి కూడా చదవండి

పద్మ పురస్కారాలు ఎంపికైన తెలుగువారికి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, సినీ హీరో చిరంజీవి, అనేకమంది ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో చేసిన విశేష కృషితో అవార్డులు అందుకొని తెలుగుజాతి గర్వించేలా చేశారని కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..