Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..

|

Jul 18, 2021 | 9:46 AM

India Covid-19 Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న సూచనలతో ప్రభుత్వం

Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..
Covid 19 Vaccination
Follow us on

India Covid-19 Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న సూచనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా చేపడుతోంది. అంతేకాకుండా టీకాల కొరత ఏర్పడకుండా ఉత్పత్తి, సరఫరా ప్రక్రియపై కూడా నిరంతరం సమీక్షిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 40,44,67,526 మందికి టీకా డోసులను అందించినట్లు వెల్లడించింది. వీటిలో.. శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి టీకా అందించినట్లు వెల్లడించింది. వారిలో 21,18,682 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి మొదటి డోసు.. 2,33,019 మందికి రెండో డోసు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను దేశంలో జనవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరు నెలలు పూర్తైంది. కానీ దేశ జనాభాలో కేవలం దాదాపు ఆరు శాతం మంది ప్రజలకే ఇప్పటివరకు రెండు డోసుల వ్యాక్సిన్ లభించినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలను అందిస్తున్నారు.

కాగా, ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఉత్పత్తి, సరఫరాలో జాప్యం కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త మందకొడిగా కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

Also Read:

Tokyo Olympics 2021: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం.. మరో ఇద్దరికి పాజిటివ్..

Parliament Monsoon Session 2021: రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు.. ఈ ఉదయం అఖిలపక్ష సమావేశం..