ఉగ్రవాదం అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. ఆపరేషన్ తీరును వివరించిన భారత త్రివిధ దళాలు

ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులను నిర్మూలించడానికే అని భారత DGMO రాజీవ్ ఘాయ్ మరోసారి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి భారతదేశంలోని త్రివిధ సైన్యాలు ఆదివారం (మే 11) మీడియా సమావేశం నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వివరించారు.

ఉగ్రవాదం అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం..  ఆపరేషన్ తీరును వివరించిన భారత త్రివిధ దళాలు
Indian Tri Arms

Edited By: TV9 Telugu

Updated on: May 12, 2025 | 6:49 PM

ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులను నిర్మూలించడానికే అని భారత DGMO రాజీవ్ ఘాయ్ మరోసారి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి భారతదేశంలోని త్రివిధ సైన్యాలు ఆదివారం (మే 11) మీడియా సమావేశం నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వివరించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయకులను అనవసరంగా హత్య చేసిన క్రూరత్వం యావత్ భారతదేశాన్ని కదిలించిందన్నారు. దేశం చూసిన భయంకరమైన దృశ్యాలు, బాధిత కుటుంబాల బాధను మన సాయుధ దళాలు, నిరాయుధ పౌరులపై ఇటీవల జరిగిన అనేక ఇతర ఉగ్రవాద దాడులతో కలిపితే, ఒక దేశంగా మన సంకల్పానికి మరో బలమైన సందేశాన్ని పంపాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించామన్నారు. అందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. ఉగ్రవాదానికి పాల్పడినవారిని, భారతదేశాన్ని నష్టం కలిగించే ప్రణాళిక వేసేవారిని శిక్షించేందుకు, వారి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలన్న స్పష్టమైన సైనిక లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్‌ను రూపొందించామని డీజీఎంఓ తెలిపారు. భారతదేశ దృఢ సంకల్పం, ఉగ్రవాదం పట్ల అసహనం, ఉగ్రవాద దాడికి సైన్యం స్పందించింది. ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నారు. మే 7 ఉదయం, సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ ప్రారంభించి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. మే 6-7 తేదీల ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు కూడా మరణించారు. #WATCH...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి