AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలి మరణంతో మంచం పట్టిన మృగరాజు..! కన్నీళ్లు పెట్టిస్తున్న పటౌడీ, మరియం ప్రేమ కథ!

గోరఖ్‌పూర్ జూలోని 15 ఏళ్ల సింహం పటౌడీ కాలేయ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్యం విషమించడంతో కాన్పూర్ జూకు తరలించారు. మరియం అనే ఆడ సింహం మరణం తర్వాత పటౌడీ విషాదంలో మునిగిపోయాడని, ఆహారం తినడం తగ్గించాడని తెలిసింది. ఈ వార్త పటౌడీ, మరియం మధ్య ప్రేమకథను కూడా వెలుగులోకి తెచ్చింది.

ప్రియురాలి మరణంతో మంచం పట్టిన మృగరాజు..! కన్నీళ్లు పెట్టిస్తున్న పటౌడీ, మరియం ప్రేమ కథ!
Pataudi And Mariyam
SN Pasha
|

Updated on: May 11, 2025 | 7:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూలో నివసిస్తున్న సింహం పటౌడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ15 ఏళ్ల సింహానికి కాలేయంలో ఇన్ఫెక్షన్ ఉంది. ఈ ఇన్ఫెక్షన్ అతని శరీరంలో నిరంతరం వ్యాపిస్తూనే ఉంది. ఎంత చికిత్స చేసినా అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో శనివారం సాయంత్రం అతన్ని కాన్పూర్ జూకు తరలించారు. గోరఖ్‌పూర్ జూలో నివసించిన మరియం అనే ఆడ సింహం మరణించినప్పటి నుండి పటౌడి విచారంగా ఉన్నాడని చెబుతున్నారు. ఆహారం తినడం కూడా తగ్గించాడు. ఈ వార్తలో మనం సింహం పటౌడి, మరియం ప్రేమకథ గురించి చర్చిస్తాం.

కానీ దానికి ముందు పటౌడి పరిస్థితి ఏమిటో తెలుసుకోండి. గోరఖ్‌పూర్ జూ అధికారుల ప్రకారం.. పటౌడి సింహం దాదాపు ఒక నెల నుండి అనారోగ్యంతో ఉంది. సాధారణంగా 12 నుంచి 15 కేజీల మాంసం తినే పటౌడీ.. ఇప్పుడు కనీసం నాలుగైదు కిలోల మాంసం తినలేకపోతోంది. దీంతో రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. పటౌడికి బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం చికిత్స అందిస్తోంది. గోరఖ్‌పూర్ జూలో తగినంత వనరులు లేకపోవడంతో, తదుపరి చికిత్స కోసం కాన్పూర్ జూకు తీసుకెళ్లారు.

వెలుగులోకి వచ్చిన ప్రేమకథ

కొన్ని సంవత్సరాల క్రితం వరకు పటౌడీ గుజరాత్‌లోని షక్కర్‌బాగ్ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగేది. అక్కడి నుంచి దాన్ని పట్టుకుని ఎటావా సఫారీకి తీసుకొచ్చి, అక్కడి నుంచి గోరఖ్‌పూర్ జూలో ఉంచారు. ఎటావా సఫారీలో ఉన్న సమయంలో పటౌడీకి మరియంతో పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిందంటే, వారు ఎప్పుడూ కలిసి కనిపించేవారు. తరువాత రెండింటినీ గోరఖ్‌పూర్ జూకు తరలించారు.

వారి ప్రేమ వ్యవహారం ఇక్కడ కూడా కొనసాగింది. ఇంతలో, మరియం అనారోగ్యం కారణంగా మరణించింది. మరియం చనిపోయినప్పటి నుంచి పటౌడీ చాలా బాధగా ఉంటోంది. ఎప్పుడూ గెంతుతూ, హుషారుగా ఉండే పటౌడి పరిస్థితి ఎంతగా మారిందంటే, అతను తరచుగా తన ఆవరణలో ఎక్కడో ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చొని కనిపించేది. ఇంతలో ఆరోగ్యం కూడా క్షిణించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి