
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.. ఇంతకాలం వాయిదాల పర్వం కొనసాగగా.. సోమవారం పార్లమెంటులో కీలక చర్చ జరగనుంది.. ఆపరేషన్ సింధూర్‌పై మ.12 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక చర్చను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ తో ప్రతిదాడికి దిగింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్ తీర్చుకుంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వాదనలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై సుధీర్ఘ చర్చ జరగనుంది.
ఆపరేషన్ సింధూర్‌పై 16 గంటలపాటు లోక్‌సభలో చర్చిస్తారు. దీంతో సభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీలకు విప్ జారీ అయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు ఎంపీలకు విప్ జారీచేశాయి. మరోవైపు ఎన్డీయే, ఇండికూటమి పార్లమెంటు పార్టీ నేతల వేర్వేరు సమావేశాలు నిర్వహించాయి.. సభలో వ్యూహాలపై రెండు కూటముల నేతలు ఇప్పటికే చర్చించారు.
కాగా.. లోక్‌సభలో జరిగే చర్చలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే సహా పలువురు నేతలు పాల్గొంటారు. లోక్‌సభ, రాజ్యసభలో జరిగే చర్చలో ప్రధాని మోదీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి చర్చలో పాల్గొంటారు. టీడీపీకి 30 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. రేపు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సాగనుంది. ఈ చర్చలో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొంటారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతిదాడికి దిగింది భారత్.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్ తీర్చుకుంది.