
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ఈ మేరకు భారత్ – పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు.. భారత్ – పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుంచి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. ఇరు దేశాలకు అభినందనలు తెలియజేస్తున్నానన్న అమెరికా అధ్యక్షుడు.. రెండు దేశాలు సమయస్పూర్తితో వ్యవహరించాయని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. భారత సైన్యం చాలా యాక్టివ్‌గా ప్రత్యర్థి డ్రోన్లు, రాకెట్లను కూల్చేస్తోంది. జమ్ము నగరం మొత్తం విద్యుత్ అంతరాయం కలిగింది. శత్రు సేనల నుంచి వస్తున్న డ్రోన్లను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో కూల్చేస్తున్నారు. కొన్ని రాకెట్లను కూడా కూల్చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్‌పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్‌గా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్, అఖ్నూర్‌లో సైరన్‌లు మోగాయి.
పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది. 10 పాక్ డ్రోన్లను S400తో పేల్చేసింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను కూడా పాక్ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా.. పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీడ్రోన్ సిస్టమ్‌తో పాక్ డ్రోన్లను కూల్చివేశారు.
సాంబా సెక్టార్‌లోనూ పాక్ దాడులకు తెగబడింది. అయితే పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్‌లో భీకరంగా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్ము వర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను భారత్ కూల్చివేసింది.
జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుపై సీమాంతర కాల్పుల సమయంలో దేశ సేవలో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ధైర్యవంతుడైన సబ్ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము.”
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం (మే 10, 2025) రాత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కాల్పుల విరమణ తర్వాత పౌరులను అభినందించారు. “పాకిస్తాన్ ఆత్మగౌరవం కలిగిన దేశమని స్పష్టం చేశారు. మా గౌరవం, ధైర్యం మా ప్రాణాల కంటే మాకు ముఖ్యమైనవి. ఎవరైనా వారిని సవాలు చేస్తే, మా భూమిని రక్షించుకోవడానికి ఇనుప గోడగా మారుతాము” అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ పై అన్యాయమైన యుద్ధం రుద్దడానికి భారతదేశం పహల్గామ్ సంఘటనను ఒక సాకుగా ఉపయోగించుకుందని మరోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆదేశ ప్రజలకు మరోసారి పచ్చి అబద్ధం చెప్పాడు. భారతదేశం నిరాధారమైన ఆరోపణలను ఎదుర్కొంటూ పాకిస్తాన్ స్వతంత్ర, తటస్థ దర్యాప్తును ప్రతిపాదించిందని, సంయమనం పాటించిందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ కాల్పుల ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విరమణ ఒప్పందంద జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్‌వోసీ దగ్గర పాక్ కాల్పులు జరిపిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత సరిహద్దు వెంబడి, కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తోందన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘించడం సరికాదన్నారు. అయితే, తాజా పరిణామాలను ఆర్మీ నిశితంగా గమనిస్తోందన్నారు. సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా.. పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని విక్రమ్ మిస్రీ సూచించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి ఆదేశాలు ఇచ్చామని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
శ్రీనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమైంది. పాకిస్తాన్ వైపు నుండి కాల్పులు ఆగిపోయిన తర్వాత శ్రీనగర్ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేచిపోయింది. విద్యుత్ సరఫరా మొదలైంది.
కాల్పుల విరమణకు సంబంధించి షాబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. కానీ అతను దానిని పోస్ట్ చేసే సమయానికి కాల్పుల విరమణ విచ్ఛిన్నమైంది. ఈ ప్రాంతంలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ ఫలితాన్ని సులభతరం చేసినందుకు పాకిస్తాన్ అమెరికాను అభినందిస్తుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వ ప్రయోజనాల దృష్ట్యా దీనిని అంగీకరించాము. దక్షిణాసియాలో శాంతికి వారి విలువైన కృషికి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నా సమస్యల పరిష్కారంతోపాటు.. శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం దిశగా కొత్త ప్రారంభం అని పాకిస్తాన్ విశ్వసిస్తుందని షాబాజ్ పేర్కొన్నారు. .
We thank President Trump for his leadership and proactive role for peace in the region .
Pakistan appreciates the United States for facilitating this outcome, which we have accepted in the interest of regional peace and stability.
We also thank Vice President JD Vance and…
— Shehbaz Sharif (@CMShehbaz) May 10, 2025
డ్రోన్లు వచ్చాయని, కానీ వాటిలో చాలా వరకు వెనక్కి వెళ్లిపోయాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఉరి, బారాముల్లా లేదా ఉత్తర కాశ్మీర్‌లో ఎటువంటి షెల్లింగ్, కాల్పులు, డ్రోన్‌లు కనిపించలేదని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా, ఉత్తర కాశ్మీర్‌లోని అన్ని ప్రదేశాలలో బ్లాక్‌అవుట్ విధించినట్లు వెల్లడించారు. అమృత్‌సర్‌లోని వైమానిక స్థావరంపై ఎటువంటి దాడి జరగలేదని స్థానిక అధికారులు కూడా స్పష్టం చేశారు.
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, చైనా తన సార్వభౌమత్వాన్ని , ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్‌కు అండగా నిలుస్తుందని చైనా తెలిపింది.
ప్రస్తుతం పఠానకోట్‌లో శాంతి నెలకొంది. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగాయి. పేలుడు శబ్దం లేదు, బ్లాక్అవుట్ మాత్రమే ఉంది. జలంధర్, హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, అమృత్‌సర్‌లలో కూడా బ్లాక్అవుట్ పాటిస్తున్నారు.
ఎల్‌ఓసీ వద్ద ప్రస్తుతం కాల్పులు జరగడం లేదని భారత సైన్యం తెలిపింది. శ్రీనగర్‌లో ఎటువంటి పేలుడు జరగలేదని వెల్లడించింది. అలాగే విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కూడా జరగలేదన్నారు. డ్రోన్ దాడికి సంబంధించిన కొంత సమయం తర్వాత సమాచారం ఇస్తామని పేర్కొంది.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన తర్వాత, కేంద్ర హోం కార్యదర్శి, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగింది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని హోం కార్యదర్శి, డైరెక్టర్ ఐబి అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.
శ్రీనగర్‌లో వరుసగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు. ఏం జరుగుతోంది.. ఇది కాల్పుల విరమణ కాదు. అంటూ ట్వీట్ చేశారు.
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
సీజ్‌ఫైర్ ప్రకటించిన మూడుగంటల్లోనే మళ్లీ ఉద్రిక్తత
జమ్ము, శ్రీనగర్‌సహా LOC అంతటా పాక్ కాల్పులు
శ్రీనగర్‌లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన ఆర్మీ
కాల్పులను తిప్పికొట్టాలని BSFకి ఆదేశాలు
ఇంటర్నేషనల్ బోర్డర్‌లోనూ ఉద్రిక్తత
రాజస్థాన్‌లోని బార్మర్, జైసల్మేర్‌లో మళ్లీ బ్లాకౌట్
మరోవైపు సీజ్‌ఫైర్ ప్రకటన తర్వాత మొదలైన మోదీ హైలెవల్ మీటింగ్
హైలెవల్ మీటింగ్ దృష్టికి సీజ్‌ఫైర్ ఉల్లంఘన అంశం
పాక్ అభ్యర్థనతో సీజ్‌ఫైర్‌కి ఓకే చెప్పిన భారత్
తెగబడితే మాత్రం వదలిలేది లేదని ముందే వార్నింగ్
ప్రస్తుతం కశ్మీర్‌లోని LOCలో కొనసాగుతున్న ఉద్రిక్తత
#WATCH | A complete blackout has been enforced in Jammu
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/kC9CzwlxSI
— ANI (@ANI) May 10, 2025
ఎల్‌వోసీలో మళ్లీ కాల్పులు
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు
జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న బ్లాక్‌అవుట్
భారత సైనిక పోస్టులే లక్ష్యంగా కాల్పులు
ఉదంపూర్, నౌషెరా, పూంఛ్, సుందర్‌బని, ఆర్నియా, కథువా సెక్టార్లలో కాల్పుల మోత
శ్రీనగర్‌లో వరుసగా పేలుళ్ల శబ్ధాలు
పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
మూడు గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ EAM డాక్టర్ ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, CDS, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలను దోవల్ ప్రధానికి వివరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. కాల్పుల విరమణ.. నిబంధనల ప్రకారం మాత్రమే కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ NSA దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరికీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and Chiefs of all three Services, at 7, LKM. pic.twitter.com/Zcx3BWo2cA
— ANI (@ANI) May 10, 2025
కాల్పుల విరమణపై స్పందించిన చంద్రబాబు
పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ
ఈనెల 12న మళ్లీ చర్చలు జరుగుతాయి
ఉగ్రవాదంపై పోరాడుతున్న కేంద్రానికి అండగా ఉండాలి
మరణించిన సైనికుల కుటుంబాలకు తోడుగా ఉందాం-చంద్రబాబు
కొద్దిరోజులుగా భారత్‌పై పాక్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది
ఎస్-400ను ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం
పాక్ జెఎఫ్-17 ఫైటర్స్ ఇండియాపై దాడి చేయలేదు
బ్రహ్మోస్ క్షిపిణులను ధ్వంసం చేశారన్నది కూడా నిజం కాదు
శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోడ్, భుజ్‌లోని.. వైమానిక స్థావరాలపై దాడి చేయడం కూడా అవాస్తవమే
ఇందుకు సంబంధించి మేం ఆధారాలను కూడా చూపించాం
మీడియా సమావేశాల్లో పాక్ పూర్తిగా అవాస్తవాలు చెప్పింది
పాక్‌లోని మత సంస్థలపై భారత్ దాడులు చేయలేదు
కేవలం టెర్రిరస్ట్ స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది
పాక్‌లోని 4 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది
– వ్యోమికా సింగ్
కాల్పుల విరమణ అనంతరం కీలక భేటీలు
ప్రధాని మోదీతో NSA అజిత్ దోవల్ సమావేశం
ప్రస్తుత పరిణామాలను ప్రధానికి వివరించిన దోవల్
ఎల్లుండి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు
చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమాలోచనలు
రేపు మరిన్ని కీలక భేటీలు నిర్వహించే అవకాశం
కాల్పులు విరమణకు ఒప్పుకున్నామన్న భారత్
ఉగ్రవాదులపై పోరు మాత్రం ఆగదన్న భారత్
ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తామన్న భారత్
ఉగ్రదాడులను ఉపేక్షించేదిలేదన్న భారత్
“భారతదేశం – పాకిస్తాన్ ఈరోజు కాల్పులు మరియు సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనను కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా భారతదేశం స్థిరంగా దృఢమైన.. రాజీలేని వైఖరిని కొనసాగించింది. ఇది అలాగే కొనసాగుతుంది” అని EAM డాక్టర్ ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు.
భారత్ పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, “Pakistan’s Directors General of Military Operations (DGMO) called Indian DGMO at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air… pic.twitter.com/k3xTTJ9Zxu
— ANI (@ANI) May 10, 2025
భారత్ – పాకిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషక్ దర్ వెల్లడించారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
తక్షణ కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చలు జరిగాయని ఎక్స్ లో వెల్లడించారు. భారత్, పాక్ వెంటనే కాల్పులు ఆపేందుకు అంగీకరించినట్లు ప్రకటించారు. రెండు దేశాలు శాంతికి ముందడుగు వేశాయని అభినందించారు.
ట్రంప్ X పోస్ట్
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం
విమానాశ్రయం పరిధిలో జూన్ 9 వరకు డ్రోన్ల వినియోగంపై నిషేధం
ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం-సైబరాబాద్ సీపీ
ఈ నెల 13 న బీజేపీ భారీ తిరంగా ర్యాలీ
మేము సైతం దేశం కోసం పేరుతో ర్యాలీ
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభం
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ
సైన్యానికి మద్దతుగా భారీ ర్యాలీకి బీజేపీ నిర్ణయం
తిరుమలలో ఆపరేషన్ గరుడ పేరుతో మాక్ డ్రిల్
…యాత్ర సదన్ 3 వద్ద ఆపరేషన్ గరుడ ను నిర్వహిస్తున్న బలగాలు.
…టీటీడీ విజిలెన్స్, పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా మాక్ డ్రిల్.
…ఉగ్రవాదులు చొరబడితే తీసుకోవాల్సిన చర్యలపై భక్తులకు అవగాహన కల్పించిన భద్రతాధికారులు.
ఇక దేశంలో జరిగే ఉగ్రవాద దాడులను యుద్ధంగానే పరిగణిస్తామని భారత ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. అలాంటి ఉగ్ర దాడులకు యుద్ధరీతిలో ధీటైన సమాధానం చెబుతామని పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరికలు చేసింది భారత్.
అమరావతి: ఆదివారం జరిగే అమర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత , సత్య కుమార్, కేశవ్, అనగాని. పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలను అధికారిక, సైనిక లాంఛనాలు తో జరపనున్న ప్రభుత్వం.
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ శనివారం ప్రకటించింది. పాక్ భారత భూభాగంపై మిస్సైల్స్ దాడులు జరుపుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మే 7వ తేదీన సింధూర ఆపరేషన్లో ఐదుగురు ముఖ్య ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాల వెల్లడి
లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ చెందిన ఉగ్రవాదులు ఐదుగురు ఉగ్రవాదులు హతం
1.ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ ( అబూ జుందాల్) లష్కరే తోయిబాతో అనుబంధం
2.హఫీజ్ ముహమ్మద్ జమీల్. జైష్-ఏ-మహమ్మద్
3 మొహమ్మద్ యూసుఫ్ అజార్ @ ఉస్తాద్ జీ @ మొహమ్మద్ సలీమ్ @ ఘోసి సహబ్. జైష్-ఏ-మహమ్మద్
4. ఖలీద్ @ అబూ ఆకాషా, లష్కరే తోయిబా
5. మొహమ్మద్ హసన్ ఖాన్, జైష్-ఎ-మహమ్మద్
హతమైన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దర ఉగ్రవాదులు జైషే ఎ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు
మే 7వ తేదీ దాడిలో తన కుటుంబ సభ్యులు పది మందిని కోల్పోయినట్లు ఇంతకుముందే చెప్పిన మసూద్ అజహర్
భారత్ పై జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదుల పాత్ర ఉంది. ఆపరేషన్ సింధూర్ లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అఖిల పక్ష సమావేశంలో వెల్లడించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్‌కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు. ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామన్నారు.
జమ్ముకశ్మీర్‌లో వీరమరణం పొందిన ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతదేహం బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రానికి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి తండాకు మురళీ నాయక్ పార్థీవదేహం చేరుకోనుంది. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద నుంచి 100 వాహనాలతో ఆర్మీ జవాను మురళి నాయక్ పార్దివదేహంతో ర్యాలీగా కళ్లి తండా వెళ్ళనున్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
శనివారం రాత్రి గం. 8.20కి బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు నడ్డా. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలపై ఎంపీలతో నడ్డా చర్చించనున్నారు. ఉద్రిక్తతల వేళ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
భారత మిసైల్ దాడులకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం వాడలేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖ్వరజ్మీ స్పష్టంచేశారు. ఈ మేరకు పాకిస్థాన్ తమ దేశంపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి పాకిస్థాన్‌పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టంచేశారు. అఫ్గన్లు ఎప్పుడూ భారత దేశాన్ని పాక్ కంటే ఎక్కువగా విశ్వసిస్తారని పేర్కొన్నారు. పాక్ ప్రయత్నం మరోసారి మాయాజాలమేనని పేర్కొన్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అవసరమైన మేరకు ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో టాప్ టెర్రరిస్టులు హతం
కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు కేంద్రం ప్రకటన
ముగ్గురు జైషే.. ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ప్రకటించిన భారత్
చనిపోయినవారిలో జైషే హెడ్ మసూద్ అజార్ బంధువులు
హతమైన ఉగ్రవాదుల్లో ముంబై 26/11 దాడుల నిందితుడు
- 1. ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ @ అబూ జుందాల్ (లష్కరే)
- 2. హఫీజ్ మొహ్మద్ జమాల్ (జైషే గ్రూప్) (మసూద్ అజార్ బావమరిది)
- 3. మహ్మద్ యూసుఫ్ అజార్ @ ఉస్తాద్‌జీ @ ఘౌసిసాబ్ (జైషే గ్రూప్) (మసూద్ అజార్ బావమరిది)
- 4. ఖలీద్ @ అబూ అఖాస (లష్కరే) (అనేక ఉగ్రదాడుల్లో నిందితుడు)
- 5. మహ్మద్ హసన్‌ఖాన్ (జైషే) (పీవోకేలో జైషే కమాండర్)
భారత్‌పై తాము అనేక దాడులు చేశామంటూ పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. సిర్సాలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, అదంపూర్‌లో ఎస్-400 బేస్, విద్యుత్, సైబర్, మౌలిక వ్యవస్థలను తాము ధ్వంసం చేశామని పాక్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. భారత్ మిస్సైల్స్ ఆఫ్గానిస్తాన్ టార్గెట్ చేశాయనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని వివరించారు.
భద్రతా దళాలకు ప్రజలంతా అండగా ఉండాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సైన్యం కోసం అన్ని ఆలయాల్లో పూజలు చేయాలన్నారు. బషీర్‌బాగ్‌లోని ఆలయంలో భారత్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. సైనికులు భారత్‌ను విజయం వైపు నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
— ఇక ఆపేద్దాం అంటూ భారత్ ముందు కాళ్లబేరం
— భారత్ దూకుడుతో మారిన సీన్
— ఉద్రిక్తతలు తగ్గించుకుందామని భారత్‌కు సంకేతాలు
— పాక్ మీడియాకు ఇంటర్వ్యూలో విదేశాంగమంత్రి ఇషాక్‌దార్
దేశంలోని సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ దాడులకు తెగబడుతుందన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. పాక్ సేనలు ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్లను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయన్నారు ఖురేషి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేసింది భారత్ ఆర్మీ. LOC పరిధిలో పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన వీడియోను విడుదల చేశారు.
అటు భారత్‌లోని ఆర్మీ బేస్‌లను, s-400 వ్యవస్థలను నిర్వీర్యం చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ప్రకటించింది విదేశాంగ శాఖ. ఉధంపూర్, సిర్సీ, సూరత్‌ఘర్ ఎయిర్‌బేస్‌లు సురక్షితంగా ఉన్నాయని అన్నారు.
– భారత విదేశాంగ మంత్రితో అమెరికా సెక్రటరీ ఫోన్
– పాక్‌తో యుద్ధపరిణామాలపై మాట్లాడిన మార్కో రుబియో
– భారత్ -పాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. మార్గాలను అన్వేషించాలని సూచించిన మార్కో రుబియో
– 2 దేశాలు నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచన
– భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా.. అమెరికా భారత్-పాక్‌కి మద్దతిస్తుందని చెప్పిన మార్కో రుబియో
— ఆపరేషన్ సింధూర్‌పై బ్రీఫింగ్
— రక్షణ, విదేశాంగ శాఖ సంయుక్త ప్రెస్‌మీట్
– పాక్ దాడులు, భారత్ ఎదురుదాడులపై వివరణ
– ప్రధాని మోదీ నివాసానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్
– ప్రధాని మోదీతో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ భేటీ
– సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ
— పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణవ్యవస్థలు
— సత్తాచాటిన S-400 డిఫెన్స్ సిస్టమ్
— ఆకాష్ మిసైల్, L-70, Zu-33, షిల్కా ముందు తేలిపోయిన పాక్– శ్రీనగర్‌లో ఉదయం రెండు పేలుళ్లు
– భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయన్న స్థానికులు
– నిన్న రాత్రంతా సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు
— భారత్ దాడులతో పాక్ వైమానిక వ్యవస్థ ధ్వంసం
— పాక్‌లో 3 ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడిన భారత్
— రావల్పిండిలోని నూర్‌ఖాన్ వైమానిక స్థావరంపై దాడి
— చక్‌వాల్‌లోని మురిద్ ఎయిర్‌బేస్ ధ్వంసం
— షార్‌కోట్‌లోని రఫీకీ ఎయిర్‌వేస్‌పై విరుచుకుపడిన భారత్
— ఇస్లామాబాద్‌తోపాటుపాటు, లాహోర్, పెషావర్..
— రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌లను మూసేసిన పాక్
— 4 వైమానిక స్థావరాలతోపాటు, మొత్తం పాక్ గగనతలం క్లోజ్
— మధ్యాహ్నం 12వరకు పాక్ ఎయిర్‌పోర్టులు మూసివేత
— పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్
— డ్రోన్లను ధ్వంసం చేసిన భారత బలగాలు
— పంజాబ్ అమృత్‌సర్‌లో కూలిన డ్రోన్
— ముల్గని పోర్ట్ విలేజ్‌లో శకలాలను గుర్తించిన ఆర్మీ
– శ్రీనగర్‌లో 2 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేసిన భారత్
– ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ కూల్చివేత
– యుద్ధ విమానాలు కూల్చేసమయంలో దూకేసిన పైలట్లు
– శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయిన పాక్ పైలట్లు
– పాక్ పైలట్ల కోసం గాలిస్తున్న భారత భద్రతా బలగాలు
– బారాముల్లా- బుద్గామ్- శ్రీనగర్ మధ్యలో ఈ జెట్స్‌ను కూల్చేశారు.
– రాజౌరీలో జనావాసాలు టార్గెట్‌గా పాక్ క్షిపణి దాడులు
– పలు ఇళ్లు ధ్వంసం.. ఒకరు మృతి.. మరికొందరికి గాయాలు
– డ్రోన్ దాడుల్లో అదనపు డీడీసీ రాజ్‌కుమార్ తాపా దుర్మరణం
– సంతాపం తెలిపిన సీఎం ఒమర్ అబ్దుల్లా
– నిన్నటి వరకూ తమతో పనిచేసిన అధికారి, నిన్న తన సమీక్షలోనూ పాల్గొన్న అధికారి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారంటూ ఒమర్ ట్వీట్ చేశారు.
– అటు.. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరీలో ఘటనా స్థలానికి చేరుకున్నాయి అదనపు భద్రతా బలగాలు..
– రాజ్‌కుమార్ తాపా జమ్ముకాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన అధికారి
– నిన్న జమ్ముకాశ్మీర్ డిప్యూటీ సీఎంతో కలిసి రాజౌరీ జిల్లాలో సీఎం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశానికి హాజరయ్యారు.
– ఇంతలోనే ఆయన నివాసంపై జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో సిర్సాలోని సబ్జిమండిలో ఒక పాక్ మిసైల్ శకలం లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ఈ శకలం ఫతాహ్ మిసైల్‌దా, కాదా అన్నది సైనిక బలగాలు ధృవీకరించాల్సి ఉంది.
— పాక్ దాడుల్ని తిప్పికొడుతున్న భారత్ రక్షణవ్యవస్థ
— భారత్‌పైకి ఫతాహ్-2 మిసైల్‌ను ప్రయోగించిన పాక్
— 400 కి.మీ టార్గెట్‌లను ఛేదించే ఫతాహ్ మిసైల్
— హర్యానాలోని సిర్సాలో ఫతాహ్ మిసైల్ పేల్చివేత
— గురిచూసి కొట్టిన భారత యాంటీ మిసైల్ వ్యవస్థలు
— గత రాత్రి 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు
— పాక్‌కు గట్టిగా సమాధానం చెబుతున్న భారత్
— పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్ పోస్టును ధ్వంసం చేసిన భారత్
— భారత భూభాగంలోకి డ్రోన్లు పంపేందుకు ఉపయోగించే టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసం చేసిన భారత్
— పాకిస్తాన్ ఆర్మీ పోస్టుతో పాటు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపింది
— డ్రోన్ దాడులకు దీటుగా భారత సైన్యం బదులిస్తోంది
— భారత ఎదురుదాడులతో పాక్‌లో టెన్షన్ పెరిగిపోతోంది.
— భారత్‌పై అణు యుద్ధం పేరుతో బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్.
— పాక్ ప్రధాని అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు.
— పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.
— పాక్ జాతీయ భద్రతను కాపాడేందుకు..
— అణ్వాయుధ బాధ్యత కలిగిన నేషనల్ కమాండ్ అథారిటీ
భారత వాయుసేన దాడులతో పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం
ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంక్‌ల మూసివేత
పాక్ ఎయిర్ బేస్‌లపై భారత దళాలు జరిపిన దాడులతో భారీ ప్రభావం
ఇంధన కొరతతో పాటు దేశవ్యాప్తంగా సంక్షోభ భయం
పెట్రోల్ రేషన్ విధించి జనాలను అప్రమత్తం చేస్తున్న పాక్ ప్రభుత్వం
పాక్ ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం
– శ్రీనగర్‌లో 2 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేసిన భారత్
– ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ కూల్చివేత
– యుద్ధ విమానాలు కూల్చేసమయంలో దూకేసిన పైలట్లు
– శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయిన పాక్ పైలట్లు
– పాక్ పైలట్ల కోసం గాలిస్తున్న భారత భద్రతా బలగాలు
— పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణవ్యవస్థలు
— సత్తాచాటిన S-400 డిఫెన్స్ సిస్టమ్
— ఆకాష్ మిసైల్, L-70, Zu-33, షిల్కా ముందు తేలిపోయిన పాక్
తెలియని వ్యూహాత్మక లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఫతా-1 క్షిపణిని పశ్చిమ సెక్టార్‌లో భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారత ప్రభుత్వ విలేకరుల సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ మీడియా సమావేశం సౌత్ బ్లాక్ లాన్ సమీపంలో జరుగుతుంది.
పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్లు వినిపించాయి. ఉరిలో కూడా పేలుళ్లు సంభవించాయి. తెల్లవారుజామున, పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరం దగ్గర నుండి పేలుళ్ల శబ్దాలు రావడం ప్రారంభించాయి. రాత్రిపూట పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడిని భగ్నం చేశారని భావిస్తున్నారు. అదే సమయంలో, ఉరిలో ఒక పెద్ద డ్రోన్ దాడిని కూడా తిప్పికొట్టారు.
సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో పాకిస్తాన్ నుండి నౌషేరాలో షెల్లింగ్ ప్రారంభమైంది.
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, షోర్‌కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తు్న్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. ఈ దాడి రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచుతుందని అన్నారు.
ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో ఇస్లామాబాద్‌లోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్ సమీపంలోని సెరెనా హోటల్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు.
పంజాబ్‌లోని జలంధర్‌లో అనుమానాస్పద డ్రోన్ గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో బ్లాక్‌అవుట్ విధించిన అధికారులు, దర్యాప్తు చేపట్టారు. ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తోంది. ఇంతలో, పంజాబ్‌లోని జలంధర్‌లో అనుమానాస్పద డ్రోన్ కనిపించింది. అంతేకాకుండా, పాకిస్తాన్ సరిహద్దు దాటి భారతదేశంలోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేసింది. కానీ భారత సైన్యం వాటన్నింటినీ పూర్తిగా తిప్పికొట్టింది.
గుల్లయిన ఇళ్లు, అరచేతుల్లో ప్రాణాలు..
రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో తుపాకీ చప్పుళ్లు
యధేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
చిన్న పిల్లల చేతుల్లో కనిపిస్తున్న బుల్లెట్లు
మెషిన్ గన్లతో విరుచుకుపడుతున్న పాక్ జవాన్లు
బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సరిహద్దు గ్రామాలు
క్వెట్టా-సింధ్ హైవేను BLA యోధులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాకిస్థాన్ సైన్యం పోస్ట్ వదిలి పారిపోయింది. పాకిస్తాన్-భారతదేశం మధ్య ఉద్రిక్తతల మధ్య, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టడం ప్రారంభించింది. బలూచిస్తాన్‌లోని ఐదు పాకిస్తాన్ సైనిక పోస్టులను BLA స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు BLA క్వెట్టా-సింధ్ హైవేను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిఎల్‌ఎ-పాకిస్తాన్ సైన్యం మధ్య దాదాపు 2 గంటల పాటు కాల్పులు జరుగాయి. ఇంతలో, పాకిస్తాన్ సైన్యానికి చెందిన అనేక పోస్టులను స్వాధీనం చేసుకున్న BLA, నగరం వైపు కవాతు చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు పౌర విమానాల కోసం 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. ఇందులో శ్రీనగర్, అమృత్‌సర్ సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని 32 విమానాశ్రయాలు ఉన్నాయి.
జాబితా చూడండి…
STORY | 32 airports shut for civilian flight operations till May 15: DGCA
READ: https://t.co/HlU3molb7M pic.twitter.com/cnVEyih4qe
— Press Trust of India (@PTI_News) May 9, 2025
పాకిస్తాన్ దాడి తరువాత, భారతదేశం ప్రతీకార చర్య పీవోకేలో కొనసాగుతోంది. ఇంతలో, ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దు అవతల నుండి భారీ షెల్లింగ్ జరుగుతోంది. దీనికి భారత సైన్యం, బీఎస్‌ఎఫ్ ప్రతిస్పందిస్తున్నాయి.
పాకిస్థాన్ మరోసారి రాత్రి సమయంలో భారత్ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడికి తెగబడుతోంది. భారతదేశం ప్రతీకార చర్య ప్రారంభించింది. పీవోకేలోని అనేక ప్రాంతాలు డ్రోన్ల దాడికి గురయ్యాయి. జలాల్‌పూర్ జతన్ ప్రాంతంలో కూడా ప్రతీకార చర్య తీసుకున్నారు.
చైనా తన పౌరులకు కీలక సమాచారం అందించింది. చైనా దేశ పౌరులు భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ దేశాలకు ప్రయాణించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని వెనుక చైనా కుతంత్రం ఉందని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో వాతావరణం బాగాలేదని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది.
అమృత్‌సర్‌లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు చేసిందంటూ పాకిస్తాన్ ఆధారిత ఖాతాలు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశాయి. అయితే, ఆ వీడియో 2024 నాటిదని పేర్కొంటూ PIB ఫ్యాక్ట్ చెక్ ఆ వాదనను తోసిపుచ్చింది.
గుజ్రాన్‌వాలాలో పడిపోయిన భారతీయ UAV డ్రోన్‌ను పాకిస్తాన్ సైన్యం అడ్డగించిందని పాకిస్తాన్ ఆధారిత ఖాతాలు చిత్రాలను ప్రసారం చేశాయి. ఇది పూర్తిగా అవాస్తవం. ఈ చిత్రాలు 2022లో ఉక్రెయిన్-రష్యా వివాదం నుంచి వచ్చాయని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ భారత రాఫెల్ జెట్‌లను కూల్చివేసిందని ఆరోపిస్తూ ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో 2019 నాటిదని, జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గామ్ సమీపంలో కూలిపోయిన భారత వైమానిక దళం (IAF) Mi-17 V5 హెలికాప్టర్‌కు సంబంధించిన వీడియోగా PIB ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది
పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్‌లోని బటల్ సెక్టార్‌లోని పోస్టులపై దాడి చేసి కనీసం 12 మంది భారతీయ సైనికులను చంపిందని పాక్ వీడియోలను ప్రచారం చేస్తోంది. ఈ వీడియో పాతదని మరియు ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఏ కార్యకలాపాలకు సంబంధం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. ఈ చిత్రం ఆగస్టు 2011 నాటిదని తెలిపింది.
భారత సైనిక కాలనీని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసిందని ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వాస్తవానికి ఇండోనేషియా నుంచి వచ్చిందని, మే 6, 2025 నాటిదని, ఆపరేషన్ సిందూర్‌కు ముందు చిత్రీకరించబడిందని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్‌లోని అనేక సోషల్ మీడియా ఖాతాలు భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ, “సుదర్శన్ చక్ర”ను పాకిస్తాన్ క్షిపణి ఢీకొట్టిందనే చిత్రాలను ప్రచారం చేస్తున్నాయి. ఈ చిత్రం 2023 నాటిదని మరియు మాస్కోలోని ఒక సైనిక స్థావరంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని చూపిస్తుందని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్‌లోని నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టును భారతదేశం లక్ష్యంగా చేసుకుందనే వాదనను సోషల్ మీడియా పోస్ట్‌లతో పాక్ ప్రచారం చేస్తోంది. అయితే, ఈ వాదన నిరాధారమైనదని PIB ఫ్యాక్ట్ చెక్ ధృవీకరించింది. భారతదేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.
జమ్మూ వైమానిక దళ స్థావరంలో అనేక పేలుళ్లు జరిగినట్లు ఆన్‌లైన్‌లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. PIB ఫ్యాక్ట్ చెక్ చిత్రాలను సమీక్షించి, అవి ఇటీవలివి కాదని నిర్ధారించింది. అవి వాస్తవానికి ఆగస్టు 2021లో కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుడుకు సంబంధించినవి.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ పోస్ట్‌ను నకిలీదిగా గుర్తించి, ఆ ఖాతా నిజమైనది కాదని పేర్కొంది. అజిత్ దోవల్‌కు ఫేస్‌బుక్‌లో అధికారిక అకౌంట్ లేదని స్పష్టం చేసింది
సైన్యం సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ వీకే నారాయన్ పంపిన ఓ కాన్ఫిడెన్షియల్ లెటర్ బయటకు వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. జనరల్ వీకే. నారాయన్ అసలు ఆర్మీ చీఫే కాదు.
యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇండియాలోని అన్ని ఎయిర్‌పోర్టులు మూసేశారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టు కూడా పూర్తిగా అబద్ధమే. ఇండియాలో అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమాన రాకపోకలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.
సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్‌గా పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని పంట పొలాల్లో పాక్ డ్రోన్ కూలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ నుంచి తమ పౌరులపైనే భారత్ దాడి చేసిందంటూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. భారత్ ఎదురుదాడిని తట్టుకోలేని పాక్.. ఇలాంటి తప్పుడు పోస్టులు సృష్టిస్తోంది.
జనావాసాలపై పాకిస్తాన్ దాడులు
ఒక్కొటొక్కటిగా బయటికొస్తున్న వీడియోలు
పెద్ద ఎత్తున ఇళ్లు, వాహనాలు ధ్వంసం
సైనిక స్థావరాలే టార్గెట్‌గా పాక్ దాడులు
36 ప్రాంతాలపై డ్రోన్ ఎటాక్స్ చేసిందన్న సోఫియా
పాక్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేయలేదన్న వ్యోమిక
జైషే మహ్మద్ చొరబాటుదారుల హతం
సాంబా సెక్టార్‌లో చొరబాటుకు ఏడుగురి యత్నం —
కాల్పులు జరిపిన BSF జవాన్లు
యూకే విదేశాంగ కార్యదర్శికి జైశంకర్ ఫోన్
యుఎస్ సెక్రటరీతోనూ మాట్లాడిన కేంద్రమంత్రి
పాకిస్తాన్ దుశ్చర్యల్ని వివరించిన జైశంకర్
సింధూ వివాదంతో సంబంధం లేదు
ఒప్పందం రద్దుపై జోక్యం చేసుకోలేమన్న ప్రపంచబ్యాంకు
పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగా
చైనా ఆయుధాలతో పాకిస్తాన్‌కు షాక్
పేలకుండానే కిందపడిపోయిన పీఎల్-15 మిసైల్
హోషియార్‌పూర్‌లో శకలాలు
పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది
ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని అబద్ధం చెప్పింది
మతం రంగు పూసే ప్రయత్నం చేసిందన్న మిస్రీ
- పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌పై డ్రోన్ దాడులు
- జనావాసాలపై పాకిస్తాన్ ఎటాక్
- మహిళకు తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి గాయాలు
మళ్లీ కశ్మీర్‌లో డ్రోన్ దాడులకు యత్నం
పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం
గుజరాత్ వరకూ సరిహద్దుల్లో హై అలర్ట్
రాజౌరీలోని భారత్ ఆర్మీ క్యాంప్‌పై పాక్ ఆత్మాహుతి దాడి చేసిందంటూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. కానీ ఇది కూడా పూర్తిగా తప్పుడు కథనం.
భారత్ దాడిని తిప్పికొడుతూ పాకిస్తాన్ దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ భారీ ఎక్స్‌ప్లోజివ్ బ్లాస్ట్ చేసిందంటూ కొందరు పోస్ట్ చేశారు. కానీ అది నిజం కాదు. 2020లో లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన పేలుడికి సంబంధించిన వీడియో ఇది.
పంజాబ్‌లోని జలంధర్‌పై పాకిస్తాన్ దాడి చేసిందంటూ ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇది నిజం కాదు. ఓ పంట పొలంలో వ్యర్థాలను తగలబెడుతున్న వీడియో ఇది.
ఇండియన్ ఆర్మీ పోస్ట్‌ను పాక్ ధ్వంసం చేసింది. 50మందికి పైగా భారత్ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీ దాడిలో చనిపోయారంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇంతవరకు పాకిస్తాన్ ఎలాంటి అటాక్ చేయలేదు.
–దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్
–శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ దాడులు
–ఏడు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయంటున్న స్థానికులు
–డ్రోన్‌ను పేల్చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
భారత్‌కు చెందిన సుఖోయ్ 30 ఫైటర్ జెట్‌ను ముజఫరాబాద్‌లో కూల్చేసి.. పైలెట్‌ను ప్రాణాలతో పాక్ ఆధీనంలోకి తీసుకుందంటూ మరో తప్పుడు పోస్ట్ ప్రచారంలో ఉంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. భారత్ ఫైటర్ జెట్ ఒక్కటి కూడా పాక్‌కు చిక్కలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా పాకిస్తాన్ చెరలో లేరు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. పంజాబ్ ఫిరోజ్‌పురలో డ్రోన్ దాడిలో ఓ కుటుంబం గాయపడింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సరిహద్దుకు 100కిమీ దూరంలోని హొశియాపుర్‌లోనూ పేలుడు శబ్దాలు కలకలం రేపాయి. మరోవైపు జలంధర్‌లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్‌లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
భారత్‌లో రెండు, మూడు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవనీ.. ఆన్‌లైన్‌లో కూడా ట్రాన్సాక్షన్స్ చేయొద్దనీ.. మరో పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది కూడా పూర్తి అవాస్తవం. ఏటీఎంలు యథావిథిగా పని చేస్తాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లోనూ ఎలాంటి అంతరాయం లేదు.
మూడు ఇండియన్ ఫైటర్ జెట్స్ కూలిపోయినట్టుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా అవాస్తవం. 2019లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి.. ఇప్పుడు కూలిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు.
గుజరాత్‌లోని హజీరా పోర్ట్ మీద దాడి జరిగింది. ఆ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదు. 2021 జులై 7న ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనను హజీరా పోస్ట్ పేరుతో పోస్ట్ చేశారు.
భారత్‌పై పాకిస్తాన్ మిస్సైల్స్ వర్షం కురిపించిందంటూ ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఓ గేమింగ్ వీడియోను పోస్ట్ చేసి.. భారత్‌పై భీకర దాడి అంటూ పోస్ట్ చేశారు.
— భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
— చీకటి పడడంతో కాల్పులకు తెగబడుతున్న పాక్
— యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో కాల్పులకు తెగబడుతున్న పాక్ బలగాలు
— జైసల్మేర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్ అవుట్
— పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత బలగాలు
— జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్