Onion Price Reduced: ఇటీవల ఉల్లి ధర మండిపోతుండగా, తాజాగా దిగివస్తోంది. రబీ సీజన్ ఉల్లిపాయల రాక ప్రారంభమైంది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత 8 రోజుల్లో మహారాష్ట్రలోని మండిలో క్వింటాలుకు రూ.2149 ధర తగ్గింది. అంటే హోల్‌సేల్ ధరల్లో కిలోకు రూ.21.49 తగ్గినట్లయింది. కొన్ని మండీలలో క్వింటాలుకు వెయ్యి రూపాయలకు పడిపోయింది. వచ్చే వారంలో ఉల్లి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఉల్లి ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర కంద గ్రోయర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భారత్ దిఘోలే మాట్లాడుతూ.. ధర ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నిస్తుందని, అయితే అది తగ్గినప్పుడు రైతుల నష్టాలను భర్తీ చేయడం గురించి మాట్లాడదని అన్నారు. ఉల్లి ఉత్పత్తి చేసేందుకు కిలోకు రూ.9.34 ఖర్చు అవుతుందని జాతీయ హర్టికల్చర్ బోర్డు 2017లో పేర్కొందని, నాలుగేళ్లలో ఇది రూ.13-15 కిలోలకు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
కాగా, మార్చి 1న మహారాష్ట్రలోని లోనంద్ మార్కెట్ మండిలో క్వింటాలు ఉల్లికి రూ.3600 ఉండగా, మార్చి 9న కేవలం రూ.1451కు పడిపోయింది. మోడల్ ధర రూ.3200 ఉండా, ఇప్పుడు రూ.2000లకు తగ్గిపోయింది. అయితే ఉల్లికి ప్రసిద్ది చెందిన నాసిక్ జిల్లాలో రూ.951కి పడిపోయింది. అలాగే ఫిబ్రవరి 22న టోకు ధర కిలోకు రూ.45 ఉండగా, మార్చి 9న దాని రేటు కిలోకు కనిష్టంగా 8.75 నుంచి గరిష్టంగా రూ.25కు తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో ఉల్లి ధరను మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సామాన్య జనాలకు ఇబ్బందులు కలుగకుండా ఉల్లి ధర తగ్గించే ప్రక్రియ చేపట్టింది. ఉల్లి ధర పెరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 2 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉల్లిపాయను సృష్టించబోతోంది. తద్వారా వర్షాకాలంలో, ఆఫ్ సీజన్‌లో ఉల్లి సరఫరాకు భంగం కలుగకుండా, అలాగే ధరను అదుపులో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ ఉల్లిపాయలో రికార్డ్ బఫర్ స్టాక్‌ను సృష్టించే ఉద్దేశం రైతులకు మంచి ధరలను అందించడంతో పాటు వినియోగదారులను జాగ్రత్తగా చూసుకోవడమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు