ONGC First Female Chairman: ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) సంస్థ తాత్కాలిక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అల్కా మిట్టల్‌ను నియమించింది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తిదారుకు తొలి మహిళా అధినేత్రిగా ఆమె నిలిచారు. డిసెంబరు 31న పదవీ విరమణ చేసిన సుభాష్ కుమార్ స్థానంలో మిట్టల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌తోపాటు కామర్స్‌లో డాక్టరల్ పట్టా పొందిన అల్కా మిట్టల్ నవంబర్ 27, 2018న ONGC బోర్డులో చేరిన మొదటి మహిళగా నిలిచారు. 59 ఏళ్ల మిట్టల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీకి సారథ్యం వహించిన మొదటి మహిళ.
DoPT ఏం చెప్పింది?
ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT), జనవరి 3న జారీ చేసిన ఉత్తర్వులో, “కేబినెట్‌లోని అపాయింట్‌మెంట్స్ కమిటీ (ACC) అల్కా మిట్టల్‌ను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) అదనపు బాధ్యతతో నియమించింది” అని చెప్పుకొచ్చింది. “జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చే ఆరు నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు అల్కా మిట్టల్ ONGC తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటారు” అని డీఓపీటీ ఆర్డర్ తెలిపింది.
గతంలో నిషి వాసుదేవ్ చమురు కంపెనీకి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళగా నిలిచింది. ఆమె 2014లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పగ్గాలు చేపట్టింది. ఈమేరకు ONGC ట్వీట్ చేసింది. “కంపెనీ డైరెక్టర్ (HR లేదా హ్యూమన్ రిసోర్సెస్) అల్కా మిట్టల్‌కు ONGC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. దీంతో కంపెనీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు” అంటూ ట్వీట్‌లో పేర్కొంది.
ప్రభుత్వ బోర్డు ఆమోదం..
శశిశంకర్ గతేడాది మార్చిలో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఓఎన్‌జీసీ పూర్తిస్థాయి సీఎండీని నియమించలేదు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ జూన్‌లో టాప్ పోస్ట్ కోసం ఇద్దరు ఐఎఎస్ అధికారులతో సహా తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏకంగా ఓఎన్‌జీసీలో కొత్త సీఎండీని వెతకడానికి కమిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. మిట్టల్ డిసెంబర్ 2018లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) డైరెక్టర్ (HR) గా బాధ్యతలు స్వీకరించారు. ONGC బోర్డులో హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్న మొదటి మహిళగా కూడా మారారు.
నవంబర్ 2018లో ఆమె ONGCలో చేరినప్పుడు, కంపెనీ బోర్డులో ఉన్న మొదటి మహిళగా ఆమె నిలిచారు. ONGC ప్రకారం, 27,000 మంది ఉద్యోగులకు పని వాతావరణాన్ని సురక్షితంగా మార్చారు. ఇది మహిళా ఉద్యోగులతో సహా కాంట్రాక్ట్ కార్మికులతో మెరుగైన సినర్జీని కలిగి ఉంది. డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన సుభాష్ కుమార్ స్థానంలో సీఎండీగా అల్కా మిట్టల్ నియమితులయ్యారు. అపాయింట్‌మెంట్ కమిటీ అల్కా మిట్టల్ పేరును ఆమోదించింది. ఆ తర్వాత నియామకానికి మార్గం సుగమమైంది.
#ONGC Director (HR) Dr @AlkaMit26713758 has been entrusted with additional charge of ONGC CMD, making her the first woman to head the #Energy major . @CMD_ONGC @PetroleumMin @HardeepSPuri @Rameswar_Teli pic.twitter.com/3yCJvkT2dT
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) January 3, 2022
Also Read: Karnataka: కర్ణాటకలో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. వారాంతపు కర్ఫ్యూ అమలుకు నిర్ణయం..
Silver price today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..